మహేష్ ట్వీట్స్.. వాడకం అంటే ఇలా ఉండాలి

సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు పోస్టులు పెడుతుంటారు. కొందరు కేవలం సెల్ఫీలకే సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. 

ఎవరిష్టం వాళ్లది. మనం కాదనలేం. కానీ ఇక్కడ మహేష్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ హీరో ట్విట్టర్ వాడకం చూస్తే తెగ ముద్దొస్తుంది. కేవలం తనకు, తన కుటుంబ సభ్యులకు తప్పిస్తే ఎవరికీ తన ట్విట్టర్ లో చోటివ్వడు మహేష్.

జూన్ 1 నుంచి జులై 1 వరకు మహేష్ పెట్టిన ట్వీట్స్ కేవలం 7 మాత్రమే. వీటిలో తనకు, తన కుటుంబానికి సంబంధం లేని ట్వీట్స్ 2 మాత్రమే. ఒకటి కొరటాల శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్. అతడితో సినిమా చేస్తున్నాడు కాబట్టి బర్త్ డే విశెష్ చెప్పాడు. రెండోది రంజాన్ శుభాకాంక్షలు.

ఈ రెండు మినహాయిస్తే మహేష్ పెట్టిన ట్వీట్స్ అన్నీ కేవలం స్పైడర్, శమంతకమణి సినిమాలపైనే. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పైడర్ టీజర్ ను రిలీజ్ చేశాడు. శమంతకమణిలో సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. మధ్యలో ఒకసారి ఫాదర్స్ డే సందర్భంగా కృష్ణను తలుచుకున్నాడంతే.

ఇలా చాలా పొదుపుగా ట్విట్టర్ ను వాడుతున్నాడు మహేష్. కనీసం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్ చేయడం లేదు. ఎట్ లీస్ట్ స్పైడర్ సినిమా వర్కింగ్ స్టిల్స్ ను కూడా రిలీజ్ చేయడం లేదు. సినిమా రిలీజ్ టైమ్ లో అయినా ట్విట్టర్ లో జోరు పెంచుతాడేమో చూడాలి.

Show comments