సమంతలో నాగచైతన్యకు నచ్చనిది అదే

నాగచైతన్య-సమంత నిశ్చితార్థం పూర్తయింది. ఇక మూడు ముళ్లు పడడమే ఆలస్యం. కాబోయే భార్య సమంతలో చాలా విషయాలు తనకు నచ్చుతాయని చెప్పిన చైతూ, ఒక విషయం మాత్రం అస్సలు నచ్చదని అంటున్నాడు. అదే సోషల్ మీడియాలో ప్రైవసీ.

సోషల్ మీడియాలో ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో... ఏ ఫొటో పోస్ట్ చేయాలో, ఏది సీక్రెట్ గా ఉంచాలో సమంతకు అస్సలు తెలియదంటున్నాడు చైతూ. తామిద్దరం కలిసిన ప్రతిసారి ఏదో ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుందని, అది తనకు అస్సలు నచ్చదని అంటున్నాడు చైతూ.

తనకు సమంతకు మధ్య జరిగే విషయాలు, ఫొటోలు మీడియాలోకి రావడం తనకు అస్సలు ఇష్టముండదని.. కానీ సమంత మాత్రం పెళ్లికి ముందు దొరికిన ఈ టైమ్ ను చక్కగా ఎంజాయ్ చేస్తోందని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అందుకే ఆమె సంతోషం కోసం ఈ ఒక్క విషయంలో తను ఎడ్జెస్ట్ అయిపోతున్నానని కూడా అన్నాడు.

ప్రస్తుతం వీళ్లిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాల్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి, అక్టోబర్ లో పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తోందట. పెళ్లికి గోవాను వేదికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్ లో వీళ్ల పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

Show comments