చిలుకూరులో 'ఎన్టీఆర్ పెళ్లి'

చిలుకూరు కేవలం వీసా వెంకటేశ్వరుడికే కాదు, సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి. చిలుకూరు చుట్టుపక్కల బోలెడు ఫామ్ హవుస్ లు వుండడం, మాంచి భవంతులు, తోటలు, అవసరమైతే పల్లె వాతావరణం వుండడంతో అక్కడ ఎక్కువగా షూటింగ్ లు జరుగుతుంటాయి. ఇప్పుడు అక్కడే ఈ రోజు ఎన్టీఆర్ పెళ్లి జరుగుతోంది. ఓహ్..ఎన్టీఆర్ పెళ్లి అంటే, ఎన్టీఆర్ క్యారెక్టర్ పెళ్లి అన్నమాట. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్లు పోషిస్తున్నారు. 

వాటిలో ఓ క్యారెక్టర్ కు రాశీ ఖన్నా హీరోయిన్. ఇప్పుడు ఆ హీరో ఎన్టీఆర్ కు, ఈ హీరోయిన్ రాశీఖన్నాకు పెళ్లి జరుగుతోంది. ఆ సన్నివేశాలను డైరక్టర్ బాబీ ఈ రోజు చిలుకూరు సమీపంలోని స్పాట్ లో చిత్రీకరిస్తున్నారు.

ప్రియదర్శి చాన్స్ కొట్టేసాడు

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ కు మంచి కమెడియన్ గా పరిచయం అయ్యాడు. ప్రియదర్శి. ఆ తరువాత కొన్ని క్యారెక్టర్ వేసాడు కానీ సరైనవి పడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్ జై లవకుశ లో హీరో ప్రెండ్ క్యారెక్టర్ దొరికింది. ఫుల్ లెంగ్త్ ప్లస్ హిల్లేరియస్ క్యారెక్టర్ అంట. ఈ సినిమాతో ప్రియదర్శి సెటిల్ అయిపోతాడు అంటున్నారు యూనిట్ జనాలు.

Show comments