పిక్‌ టాక్‌: టాప్‌ లేపేసిందికానీ!

కొన్నాళ్ళ క్రితం షెర్లీన్‌ చోప్రా పేరుతో ఓ సెక్స్‌బాంబ్‌ వుండేది. అఫ్‌కోర్స్‌.. ఆమె ఇప్పుడూ వుందిగానీ, అప్పట్లోలా ఇప్పుడంతలా సినిమాలు చేయడంలేదు. అయినా, ఆమె చేసిన సినిమాల కన్నా, ఎక్స్‌పోజింగ్‌తోనే పాపులర్‌ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం. ఎక్కువగా టాప్‌లెస్‌ ఫొటోలతోనే షెర్లీన్‌ చోప్రా సందడి చేసేది. ఆమె ప్లేస్‌లోకి పూనమ్‌ పాండే వచ్చింది. ఇంకా చాలామంది అదే బాటలో నడిచారు, నడుస్తూనే వున్నారు. 

తాజాగా, సీరత్‌ కపూర్‌ హాట్ హాట్ పోజులతో హల్‌చల్‌ చేస్తోంది. మొన్నీమధ్యనే సెమీ టాప్‌లెస్‌ ఫొటోతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సీరత్‌ కపూర్‌, తాజాగా మరో టాప్‌లెస్‌ పోజుతో అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ప్రస్తుతం 'రాజుగారి గది-2' సినిమాలో నాగ్‌ సరసన నటిస్తున్న సీరత్‌, సోషల్‌ మీడియాలో హీటెక్కించేస్తోంటే ఎవరైనాసరే ఆశ్చర్యపోకుండా వుండగలరా.? 

అల్ట్రా గ్లామరస్‌, అల్ట్రా స్టైలిష్‌.. అంటూ ఏవేవో మాటలు చెబుతోందిగానీ, అంతిమంగా ఆమె చేస్తోన్నది అంగాంగ ప్రదర్శనే. గ్లామర్‌ అనండీ, వల్గారిటీ అనండీ.. తాను మాత్రం దీన్నొక స్టయిలిష్‌ అప్రోచ్‌ అంటానంటోంది సీరత్‌ కపూర్‌. టాప్‌లెస్‌ ఫొటోకి చేతులడ్డం పెట్టేసి.. ఫొటోలో మాంఛి కిక్‌ ఇచ్చేసింది కదూ ఈ అందాల భామ.!

Show comments