పార్టనర్ తో సెక్స్.. పోర్న్ కాదు సుమా!

అదేదో ఒక సంసార పక్షపు సినిమాలోనే.. బెడ్రూమ్ లో భర్తతో భార్య ఎలా ఉండాలి? అని అని అడిగితే ‘వ్యభిచారిణి’ లా అని సమాధానం ఇస్తుంది ఒక వ్యాంప్ క్యారెక్టర్. ఆ మాట విని..  సీన్లోని పాత్రలు, ఆ సినిమా చూసే జనాలూ నివ్వెర పోతారు కానీ, హీరోయిన్ రోల్ ఏమో ఆ సమాధానాన్ని జస్టిఫై చేసే వాదన వినిపిస్తుంది! ఆల్ మోస్ట్ ఇదే విషయాన్ని చెబుతున్నారు శృంగార శాస్త్ర అధ్యయనకర్తలు. చెబుతున్న తీరులో మాత్రం కొంచెం వైవిధ్యం ఉంది. బెడ్రూమ్ లో మీ పార్ట్ నర్ తో సాగించే రతిని పొరపాటున కూడా అసభ్యం అనో, బూతు అనో భావించవద్దు.. మీరు సాగించేది పోర్న్ కాదు.. అని నొక్కి చెబుతున్నారు!

ఉభయుల కంఫర్ట్ నెస్ ఉన్నంత వరకూ ఏ విషయంలో మొహమాట పడనక్కర్లేదని వీరు ధైర్యం చెబుతున్నారు. ఇలా మొహమాట పడే వాళ్లలో ఎంతో మంది మగవాళ్లూ ఉండవచ్చు. ఆడవాళ్లు సహజంగానే మొహమాట పడుతూ ఉండవచ్చు.. ఈ ఇరు వర్గాల్లోని వారు కూడా ఆ మొహమాటాన్ని వదిలించుకుని ఆస్వాధించాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు! 

గో డౌన్ ప్లీజ్..’ అని అతడు అడిగితే.. మొహమాటంతోనో, సిగ్గుతోనో.. మొహం చూపించలేక దిక్కులు చూడవద్దని వీళ్లు చెబుతున్నారు. అతడు కిందికి దిగి మిమ్మల్ని సంతోష పెట్టినప్పుడు.. ప్రతిగా సంతోష పెట్టడంలో తప్పేం లేదని నొక్కి చెబుతున్నారు. ఇంత విపులంగా వీరు చెబుతున్నది దేని గురించినో అర్థం చేసుకోవడం కష్టం కాదు. “ఎస్కేప్ కావడానికి చాలా రీజన్లే ఉండవచ్చు.. కానీ అందులో సిగ్గు పడటానికి, మొహమాట పడటానికి ఏమీ లేదు.. ఆ పని ఏదో పోర్న్ మూవీస్ లోనో చేసేదనో, అదో విపరీతమైనదనో అనుకోవాలని లేదు. ఒకరి విషయంలో సహజం అయినప్పుడు, మరొకరి విషయం లో అసహజం కాదు..’’ అంటూ మరింత విపులంగా పేర్కొన్నారు మరో అధ్యయన నిపుణులు. 

ఆ ఒక్క విషయంలోనే కాదు.. కామసూత్రను ఫాలో కావడమో, కొంచెం కొత్తగా ట్రై చేయడాన్ని కూడా ఏదో అనుచిత చర్య అని, నిషేద్ధమైన పనిగా భావిస్తున్న వాళ్లు ఉన్నారు. అదంతా బూతుగా భావించేవాళ్లున్నారు. అదంత సహజమైన శృంగారమే.. ఈ విషయంలో ఎవరికి వారు మానసికంగా ప్రిపేర్ అయ్యుండాలి. ఉన్న జీవితంలో ఇలాంటి ఆస్వాధన జోలికి వెళ్లకుండా గడిపేసే వాళ్లూ అంతటా ఉంటారని, వాళ్లు చాలా మిస్ అవుతున్నట్టే అని.. ఈ కేటగిరిలో కొనసాగుతున్న వారిలో ఎవరో ఒకరు చొరవ తీసుకుంటే.. శృంగారాధ్యయంలో కొత్త చాప్టర్ లోకి వెళ్లినట్టే అని ఊరిస్తున్నారు ప్రణయ బంధ పరిశోధకులు!

 

Show comments