ఆయ్..బాబోయ్..నిజమా సుక్కూ

మైత్రీ మూవీస్ మూడో సినిమా సంగతులు భలేగా వినిపిస్తున్నాయి. హీరో చెవిటి వాడు అన్నది ఇప్పటికే పక్కా అయిపోయింది. ఫర్ ఏ చేంజ్ అంటూ రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే నిజమో అబద్ధమో కానీ, ఇప్పడు మరో గ్యాసిప్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ మూగదట. 

ఎప్పుడో సిరిసిరిమువ్వలో జయప్రదను చూసాం మూగ హీరోయిన్ క్యారెక్టర్ లో. ఇప్పుడు ఈ క్యారెక్టర్లో సమంత కనిపించబోతోందట. గ్యాసిప్ నిజమే అయితే భలేగా వుంటుంది సుకుమార్ సినిమా. చెవిటి హీరో, మూగ హీరోయిన్. 

అది కూడా సెల్ ఫోన్ లు లేని, 1990 నాటి పల్లెటూళ్లో. అవును ఆ కాలంలో పల్లెటూళ్లలో కరెంట్ కూడా అంతగా వుండేది కాదు. కొంపదీసి అలాగే చూపిస్తారా ఏంటీ? అయినా డైరక్టర్ సుకుమార్ సినిమా లైన్ పై కాస్త క్లారిటీ ఇచ్చేయడం బెటరేమో? లేదూ అంటే ఇలా గ్యాసిప్ లు వస్తూనే వుంటాయి. లేదా చెవిటి హీరో మాదిరిగానే మూగ  హీరోయిన్ అన్నది కూడా నిజమై కూర్చుంటుందా? ఏమో?

Show comments