ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న తాప్సి

ఓ వైపు తారలంతా సైమా అవార్డుల్లో సందడి చేస్తే తాప్సి మాత్రం తనకుతానుగా కొత్త డెస్టినేషన్ ప్లాన్ చేసుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు నార్వేలో సందడి చేస్తోంది.

అది కూడా సినిమా షూటింగ్ కోసం కాదు. కేవలం తన ఎంజాయ్ మెంట్ కోసం. అవును.. కాస్త రిలాక్స్ అవ్వడం కోసం క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి నార్వే ట్రిప్ ప్లాన్ చేసింది తాప్సి.

టైం దొరికితే ఏదో ఒక దేశం చుట్టి వచ్చేయడం తాప్సికి అలవాటు. ఏప్రిల్ లో ఈ అమ్మడు థాయ్ లాండ్ లో గడిపింది. అక్కడ ఓ ద్వీపంలో స్కూబా డైవింగ్ కూడా చేసింది.

తర్వాత నెల రోజులు గ్యాప్ ఇచ్చి జూన్ లో లండన్ వెళ్లింది. అక్కడ ఏకంగా 2 వారాలు గడిపి వచ్చింది. మళ్లీ నెల రోజులు గ్యాప్ లో ఇప్పుడు నార్వేలో ప్రత్యక్షమైంది తాప్సి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జుద్వా-2 సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రచారం ప్రారంభించడానికి ఇంకా 2 వారాల టైం ఉంది. ఈ గ్యాప్ లో నార్వే చెక్కేసింది. సెప్టెంబర్ లో జుద్వా-2 థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కాకుండా తాప్సి చేతిలో మరో హిందీ సినిమా ఉంది.

Show comments