పిక్‌ టాక్‌: కారుకోసం 'కాక' పుట్టించింది.!

'చిరుత' సినిమాతో రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన నేహా శర్మ, ప్రస్తుతానికైతే బాలీవుడ్‌లో సెటిలైపోయింది. అక్కడా కెరీర్‌ ఎత్తు పల్లాలతోనే కొనసాగుతోందనుకోండి.. అది వేరే విషయం. తనతోపాటు, తన చెల్లెలు ఐషా శర్మని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చిన నేహా శర్మ, సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటోంది. హాట్‌ హాట్‌గా ఫొటోలతో సోషల్‌ మీడియా ద్వారా అభిమానుల్ని అలరిస్తోంది. 

ఇక, తాజాగా 'స్టఫ్‌' మ్యాగజైన్‌ కోసం.. ఇదిగో ఇలా హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. కవర్‌ పేజ్‌ మీద అదిరిపోయే హాట్‌ లుక్‌ కెవ్వు కేక అనేలా వుంది. బికినీ తరహా కాస్ట్యూమ్స్‌తో తన కెరీర్‌లోనే ది బెస్ట్‌ ఫొటోగ్రఫీ.. అంటూ తనకు తానే కితాబులిచ్చేసుకుంది నేహా శర్మ.

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. హీరోయిన్‌గా కెరీర్ సంగతి ఎలా వున్నా, అప్పుడప్పడూ, ఫొటో సెషన్లలో మాత్రం, నేహా శర్మ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘స్టఫ్’ తాజా ఎడిషన్ కవర్ పేజ్ మీద ఓ లగ్జరీ కారు ప్రమోషన్ కోసం నేహా ఇలా హాట్ హాట్ పోజులతో రెచ్చిపోయింది.

Show comments