నా కూతురితో ఆటలొద్దు ప్లీజ్‌

'నాతో ఆటలాడుకున్నారు.. నా కూతురితోనూ ఆటలాడుకోవాలనుకుంటున్నారా.? ప్రస్తుతానికి నా కూతురు చాలా చిన్న పిల్ల. ఇంకా సినిమాల్లోకి రావాలనే విషయమై మాకెవరికీ ఓ క్లారిటీ లేదు. అసలామె సినిమాల్లోకి వస్తుందో లేదో తెలియదు. ఈ వయసులో ఆమె చుట్టూ గాసిప్స్‌ అస్సలే వద్దు ప్లీజ్‌..' అంటూ మీడియాకి విజ్ఞప్తి చేస్తోంది 'అతిలోక సుందరి' శ్రీదేవి.

శ్రీదేవి కుమార్తె జాన్వీ సినిమాల్లోకి రాబోతోందంటూ ప్రచారం జరుగుతోన్న వేళ, అదంతా ఉత్తదేనని, అతిలోక సుందరి పలు సందర్భాల్లో కొట్టి పారేసిన విషయం విదితమే. అయినా, ఆమె చుట్టూ గాసిప్స్‌ మాత్రం ఆగడంలేదు. జాన్వీ సైతం, సినిమాల్లోకి వచ్చేందుకోసమేనంటూ ఫిజిక్‌ మీద పూర్తిగా దృష్టిపెట్టింది. వర్కవుట్స్‌ షురూ చేసింది. 'ఫిగర్‌'ని మెయిన్‌టెయిన్‌ చేయడం కోసం తల్లి సూచనతో ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ని కూడా పెట్టుకుంది.

ఇక్కడితో ఆగితే, ఆమె శ్రీదేవి కుమార్తె ఎందుకవుతుంది.? తన శరీరంలో వున్న నెగెటివ్స్‌ని ప్లస్‌ పాయింట్స్‌గా మలచుకునేందుకు చాలా చాలా ప్రయత్నాలే చేస్తోందట. అందులో భాగంగానే, నోస్‌ సర్జరీని ఆశ్రయించిందన్న ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యవహారం ఆనోటా ఈ నోటా శ్రీదేవి దృష్టికి కూడా వెళ్ళింది. గతంలో శ్రీదేవి కూడా నోస్‌ సర్జరీ చేయించుకున్న విషయం విదితమే. అదే బాటలో, జాన్వీ కూడా నోస్‌ సర్జరీ చేయించుకుందన్నది బాలీవుడ్‌ మీడియా కథనాల సారాంశం.

ఈ వ్యవహారంపై స్పందించిన శ్రీదేవి, జాన్వీ విషయంలో అప్పుడే గాసిప్స్‌ తగవనీ, సర్జరీలంటూ ఆమెతో ఆటలాడొద్దనీ మీడియాకి క్లాస్‌ తీసుకుంది. 'చిన్న పిల్ల కదా, గాసిప్స్‌ని తట్టుకోలేదు..' అంటూ శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Show comments