నాని ఎంబీఏలో చేరతాడు. ఆ చదవు సంగతి అటుంచి ఎంబీఏ పేరుతో హీరోయిన్ ను ఫుల్లుగా డిస్ట్రబ్ చేస్తాడు. ఫైనల్ గా ఆమెను తనదాన్ని చేసుకుంటాడు. ఇదంతా నేను లోకల్ కథ. అయితే ఎంబీఏ తర్వాత నెక్ట్స్ ఏంటి...? దీనికి సమాధానం కూడా దొరికింది. త్వరలోనే ఎంసీఏ చేస్తాడట నాని.
ఈరోజు నాని పుట్టినరోజు.. అతడికి బర్త్ డే విషెష్ చెబుతూ దిల్ రాజు ఆఫీస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. పోస్టర్ పైన "లోకల్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ బాగానే చెప్పారు. కానీ కింద మాత్రం నెక్ట్స్ ఏంటి అంటూ ఓ క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాని కిందే ఎంసీఏ అనే టైటిల్ పెట్టి, షూట్ స్టార్ట్ సూన్ అంటూ ప్రకటించేశారు.
ప్రస్తుతానికైతే నాని సినిమాలకు సంబంధించి ఇదే హాట్ న్యూస్. ఓవైపు నాని సినిమాకు సంబంధించి నిన్ను కోరి అంటూ కొత్త సినిమా టైటిల్ ను నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటిస్తే... మరోవైపు దిల్ రాజు కూడా నాని హీరోగా ఎంపీఏ టైటిల్ ను ఎనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ కొత్త మూవీ డీటెయిల్స్ బయటకు రానున్నాయి.