బాలయ్య సరసన శ్రియ

సీనియర్ హీరో నందమూరి బాలయ్య మరోసారి హీరోయిన్ శ్రియతో జోడీ కడుతున్నారు. ఇటీవలే ఈ ఇధ్దరు కలిసి గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటించారు. బాలయ్య 101వ సినిమాలో కూడా మళ్లీ కలిసి నటించబోతున్నారు. డైరక్టర్ పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో బాలకృష్ణ తొలిసారి ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఒక కొత్త హీరోయిన్ ఫిక్సయింది. శ్రియను ఈ రోజు (శనివారం) ఫిక్స్ చేసి, అగ్రిమెంట్ చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన చాలా మంది పేర్లు వినిపించాయి కానీ ఆఖరికి శ్రియ ఫైనల్ అయింది. ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూలు పూర్తి చేసుకుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో కొటిన్నరతో వేసిన సెట్ లో రెండో షెడ్యూలు కూడా చకచకా జరుగుతోంది. పూరిజగన్నాథ్ ఈ సినిమాకు విడుదల డేట్ కూడా అనౌన్స్ చేసారు. అందుకే ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. శ్రియ కూడా ఇక సెట్ మీదకు ఒకటి రెండు రోజుల్లో వస్తుందని తెలుస్తోంది.

Show comments