సన్నీలియోన్‌పై మళ్ళీ అదే ఎటాక్‌.!

''సన్నీలియోన్‌ ముమ్మాటికీ పోర్న్‌ స్టారే.. పోర్న్‌ స్టార్‌ కాకపోతే ఇంకేమిటి.? డబ్బు కోసం ఆమె పోర్న్‌ సినిమాల్లో నటించింది.. పోర్న్‌ స్టార్‌గా ఎదిగింది.. కాదని చెప్పమనండి..'' అంటూ ఆవేశంతో ఊగిపోయింది బాలీవుడ్‌ ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌. చాలాకాలంగా సన్నీలియోన్‌తో రాఖీ సావంత్‌ 'పోటీ' పడ్తోంది.. సూటిపోటి మాటల విషయంలో. 

సన్నీలియోన్‌ పోర్న్‌ స్టార్‌ అని తెలియనిదెవరికి.? అయితే అది ఆమె గతం. ప్రస్తుతానికి సన్నీలియోన్‌ బాలీవుడ్‌ నటి. అలాగని ఎవరన్నా అంటే రాఖీసావంత్‌ ఒప్పుకోవడంలేదు. ఎందుకు.? అంంటే, ఆమె పోర్న్‌స్టార్‌ గనుక పోర్న్‌ స్టార్‌ అనే పిలుస్తానంటోంది రాఖీ సావంత్‌. 'నేనేమీ డబ్బు కోసం నగ్నంగా నటించలేదు.. పోర్న్‌ సినిమాల్లో నటించలేదు.. భారతీయ స్త్రీ ఎవరూ కూడా ఆ పని చెయ్యదు..' అంటోన్న రాఖీ సావంత్‌, ఎప్పటికీ సన్నీలియోన్‌ భారతీయ స్త్రీ కాలేదని తెగేసి చెప్పింది. 

సన్నీలియోన్‌తో పోల్చలేంగానీ, రాఖీసావంత్‌ కూడా వెండితెరపై తక్కువేం చేయలేదు. ఇప్పుడు సన్నీలియోన్‌ ఏ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తోందో, అంతకు మించే ఒకప్పుడు రాఖీసావంత్‌ తెరపై గ్లామర్‌ షో చేసేసింది. ఇదే విషయాన్ని సన్నీలియోన్‌ ఓ సందర్భంలో ప్రస్తావించింది కూడా. 'నా పాత ఇమేజ్‌ పట్టుకుని నా మీద విమర్శలు చేసేవాళ్ళకి పోర్న్‌ స్టార్‌ ఇమేజ్‌ సంపాదించడమెలాగో చేతకాదు..' అంటూ రాఖీ సావంత్‌కి గతంలోనే సన్నీలియోన్‌ కౌంటర్‌ ఇచ్చింది. మరి, తాజాగా రాఖీ సావంత్‌, తనను భారతీయ నారి కాదని అనడంపై సన్నీలియోన్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Show comments