అవసరాల 'హంటర్‌' హీట్‌ పెంచేసిందంతే.!

ప్చ్‌.. కింది పెదవి, పళ్ళ మధ్య దారుణంగా నలిగిపోతోందే... పై ఫొటో చూడగానే, కలిగే భావన ఇదే. అందమైన అమ్మాయి, పెదవి అలా కొరికిందంటే ఇంకేమన్నా వుందా.? ఆ కిక్కే వేరప్పా.. ఆ కిక్కు పెంచే హీట్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

ఇది అవసరాల శ్రీనివాస్‌ తాజా చిత్రం ('హంటర్‌' తెలుగు రీమేక్‌) ప్రీ లుక్‌. 'చిన్నదాన నీకోసం' ఫేం మిస్తీ చక్రవర్తి, బుల్లితెర బ్యూటీ శ్రీముఖితోపాటు తేజస్వి మాదివాడ, శ్రీప్రియ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. బాలీవుడ్‌లో 'హంటర్‌' సినిమా సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. 

రాధికా ఆప్టే చాలా బోల్డ్‌గా నటించిన సినిమా ఇది. దీన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు. అవసరాల శ్రీనివాస్‌ నటిస్తున్నాడనగానే, 'హంటర్‌' తెలుగు రీమేక్‌పై క్రియేట్‌ అయిన ఇంట్రెస్ట్‌ అంతా ఇంతా కాదు. ప్రీ లుక్‌తోనే అదరగొట్టేశారు. ఇక, ఫస్ట్‌ లుక్‌ ఎలా వుంటుందో, సినిమా ఇంకెలా వుంటుందో.!

Show comments