చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదది.!

'ఔను, నేను ఒకప్పుడు పోర్న్‌ స్టార్‌ని.. ఆ విషయం నాకు మీరు పదే పదే గుర్తు చేయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్‌లోకి వెళితే నేను నటించిన పోర్న్‌ సినిమాలు కనిపిస్తాయి. వాటిని నేను తొలగించలేను కదా. నా న్యూడ్‌ ఫొటోలూ ఇంటర్నెట్‌లో దర్శనమిస్తాయి. కాబట్టి, ఆ చరిత్రను నేను చెరిపోయలేను.. అదేమీ చెత్త చరిత్ర కాదు చెరిపేయడానికి.. ఏం చేశానో, అది నాకు తెలిసే చేశాను..' అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నీలియోన్‌ కస్సుబుస్సులాడింది. 

పోర్న్‌ స్టార్‌గా కెరీర్‌ని ప్రారంభించి, ఆ తర్వాత పోర్న్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పి, బాలీవుడ్‌ సినిమాల్లోకొచ్చిన సన్నీలియోన్‌ని గతం ఇంకా వెంటాడుతోంది. ఎక్కడికి వెళ్ళినా, ముందుగా ఒకప్పటి పోర్న్‌ కెరీర్‌ గురించే ఆమెను ప్రశ్నిస్తున్నారంతా. ఆ కెరీర్‌ని వదిలేసి ఎన్నో ఏళ్ళయినా, దాని గురించిన ప్రశ్నలు తనను వదలకపోవడం సన్నీలియోన్‌కి ఇబ్బందికరంగానే వుంది. 

మరోపక్క, రాఖీ సావంత్‌ లాంటోళ్ళు పదే పదే 'పోర్న్‌స్టార్‌' అంటూ సన్నీలియోన్‌ని గుచ్చి గుచ్చి విమర్శిస్తుండడంతో ఆమె పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఫుల్‌ టైమ్‌ బాలీవుడ్‌ సినిమాలకే కేటాయిస్తున్నా, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా, సన్నీలియోన్‌కి మాత్రం గతకాలపు 'పోర్న్‌' గురుతులు చెరిగిపోకపోవడం ఒకింత కష్టతరమైన విషయమే. ఆమె మర్చిపోవాలనుకుంటున్నా, ఆమె మర్చిపోలేకుండా చేసేస్తున్నారంతా. 

మొన్నీమధ్యనే ఓ ఇంటర్నేషనల్‌ మీడియా సంస్థ, సన్నీలియోన్‌ని ఇదే విషయమై ప్రశ్నిస్తే, 'చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు..' అంటూ పోర్న్‌ కెరీర్‌పై అసహనంగానే స్పందించింది.

Show comments