'ఆ పాఠాలు' ఆమె చెబుతుందా.?

భర్తకు 'ఆ ఆనందం' ఎలా ఇవ్వాలో ట్రైనింగ్‌ తీసుకోవాలంటూ మహిళా లోకానికి పిలుపునిచ్చింది బాలీవుడ్‌ సెక్స్‌బాంబ్‌ రాఖీ సావంత్‌. 'సెక్స్‌ బాంబ్‌' అనే ట్యాగ్‌లైన్‌ తనకు తానే తగిలించేసుకుని, అలా తనను ఎవరన్నా పిలిస్తే తనలో అదోరకమైన వైబ్రేషన్స్ వచ్చేస్తాయంటూ అప్పట్లో రాఖీసావంత్‌ చేసిన హంగామా గురించి అందరికీ గుర్తుండే వుంటుంది. 

ఐటమ్‌ బాంబ్‌ అంటే రాఖీ సావంత్‌ మాత్రమే అనేంతలా ఒకప్పుడు రాఖీ సావంత్‌ ఓ ఊపు ఊపేసింది. అఫ్‌కోర్స్‌, ఐటమ్‌ బాంబ్‌లా సాధించిన పేరు ప్రఖ్యాతుల సంగతెలా వున్నా, రాఖీ కా స్వయంవర్‌ సహా పలు వివాదాలతోనే ఆమె పాపులర్‌ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

అసలు విషయానికొచ్చేద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివాదం ముదిరి పాకాన పడేసరికి, తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానంటూ క్షమాపణ కూడా చెప్పేశాడు. ఎలాగోలా, ఆ వివాదం సద్దుమణిందనుకుంటే, తీరిగ్గా రాఖీ సావంత్‌ మీడియా ముందుకొచ్చి, 'ఈ విషయంలో వర్మతో నేను ఏకీభవిస్తున్నాను.. మహిళలు, తమ భర్తల్ని సంతోషపెట్టడం నేర్చుకోవాలి.. ఎప్పుడూ వంటింటికే మహిళలు పరిమితమైతే ఎలా.? సంతోషపెట్టడంలో ట్రైనింగ్‌ తీసుకోవాలి..' అంటూ తనకు తోచిందేదో మాట్లాడేసింది. 

అంతా బాగానే వుందిగానీ, భర్తతో ఎలా మెలగాలో, భర్తకి ’ఆ ఆనందం‘ ఎలా ఇవ్వాలో.. ఏ భార్య అయినా కొత్తగా నేర్చుకోవాలా.? రాఖీ సావంత్‌ ఏమన్నా, ఆ ట్రైనింగ్‌ ఇస్తుందా.? ఇచ్చినా ఇస్తుంది.. ఎందుకంటే, ఆమె రాఖీ సావంత్‌ మరి.

Show comments