డ్యాన్స్ స్టిల్ నే వదిలారుగా

నిన్నే వెల్లడించాం..మెగాస్టార్ దివాళి లుక్ గా డ్యాన్స్ స్టిల్ వదలబోతున్నారు అంటూ. అదే నిజమైంది. ఇప్పటిదాకా మెగాస్టార్ ఆన్ ది సెట్స్ ఫొటోలు ఏదో విధంగా కనిపిస్తూనే వున్నాయి. అయినా దీపావళి సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు మరింత హుషారు కలిగించేలా ఓ లుక్ విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటించారు. 

లారెన్స్ డ్యాన్స్ డైరక్షన్ లోని పాటలో మెగా స్టార్ డ్యాన్స్ స్టెప్ ఫోటోనే లుక్ గా వదుల్తున్నారని నిన్నే వివరించాం. ఇప్పుడు అదే విడుదల చేసారు. జీన్స్ ఫ్యాంట్, జాకెట్, టీషర్ట్ తో  ఒక కాలు గాల్లోవుంచి, ఒక చేతిని పైకి చూపిస్తున్న చిరు స్టిల్ ను విడుదల చేసారు. 60 ఏళ్ల వయసులో చిరు ఇలాంటి లుక్ తో వుండడం మెచ్చుకోదగ్గ విషయమే. అన్ని విధాలా మేకోవర్ కనిపిస్తోంది. 

బాడీ స్లిమ్ అయింది. ఫిజిక్ పెర్ ఫెక్ట్ గా వుంది. లుక్స్ మామూలే. మొత్తానికి ఈ స్టిల్ ఖైదీ నెం 150పై అంచనాలను మరింతగా పెంచేలాగే వుంది. ఇక ఈ స్టిల్ తో పాటే విడుదల చేసిన మరో స్టిల్ కూడా బాగానే వుంది. ఈ స్టిల్ లో మెగాస్టార్ తన మునపటి గ్లామర్ తోనే వున్నారని చెప్పకనే చెప్పారు. ఏదైనా ఈ రెండు స్టిల్స్ మెగాభిమానులకు పండగను ఓ రోజు ముందే తెచ్చాయి.

Show comments