'దంగల్‌' ఔట్‌.. 'బాహుబలి' సంగతేంటి.?

2వేల కోట్ల క్లబ్‌లో చేరిన 'దంగల్‌' అంటూ బాలీవుడ్‌ పెద్ద పండగే చేసుకుంది. 'బాహుబలి' దెబ్బకి 'బాలీవుడ్‌ పాఠాలు నేర్చుకోవాల్సిందే..' అంటూ బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు, బాలీవుడ్‌ సినీ జనాలకి క్లాస్‌ తీసుకోవడం షురూ చేసేశారు.

ఆ సమయంలో 'దంగల్‌' చైనాలో విడుదలవడం కొందరు బాలీవుడ్‌ సినీ జనాలకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చైనా వసూళ్ళతో కలుపుకుంటే, 'దంగల్‌', 'బాహుబలి'ని దాటేసిన మాట వాస్తవం. కానీ, 2వేల కోట్ల క్లబ్‌లో 'దంగల్‌' చేరిందన్నది అవాస్తవం. ఈ విషయం లేటెస్ట్‌గా వెలుగు చూసింది.

ఇకనేం, 'బాహుబలి' వచ్చేస్తోంది.. 'దంగల్‌' రికార్డుల్ని మళ్ళీ కొల్లగొట్టేస్తుందంటూ 'బాహుబలి' అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి షురూ చేసేశారు. ఇక్కడ 'బాహుబలి' అభిమానులంటే, ఆ అభిమానులు అన్ని భాషల్లోనూ వున్నారు. 'బాహుబలి' తెలుగు సినిమానే అయినా, దాన్ని ఇండియన్‌ సినిమాగా చాలామంది భావించారు. అదే స్థాయిలో ఆదరించారు కూడా. కానీ, సోకాల్డ్‌ బాలీవుడ్‌ వీరాభిమానులే, 'బాహుబలి' విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు. 

ఇక, 'బాహుబలి' తైవాన్‌లో విడుదలయ్యింది. కానీ, అక్కడి వసూళ్ళపై స్పష్టత లేదు. అతి త్వరలో 'బాహుబలి' చైనాలో విడుదల కాబోతోంది. తొలి భాగం నిరాశపర్చిన దరిమిలా, రెండో భాగం 'బాహుబలి ది కంక్లూజన్‌'పై ఉత్కంఠ నెలకొంది. ఓవరాల్‌ వసూళ్ళలో ఇంకోసారి 'దంగల్‌'ని దాటేసి, 2 వేల కోట్ల క్లబ్‌లో చేరే తొలి సినిమాగా 'బాహుబలి ది కంక్లూజన్‌' రికార్డులకెక్కుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments