చెర్రీ పేరు చిట్టిబాబు.. సినిమా పేరు రేపల్లె..?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించి సరికొత్త రూమర్ ఇది. ఈ సినిమాలో చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అట. సినిమాలో అతడు చేపలు పట్టే వ్యక్తిగా కనిపిస్తాడట. అందుకే గోదావరి పరిసర ప్రాంతాల్ని షూటింగ్ కోసం సెలక్ట్ చేసుకున్నారట. ఇక ఈ సినిమాకు రేపల్లె అనే టైటిల్ ను పిక్స్ చేసినట్టు చెబుతున్నారు.

టైటిల్స్ విషయంలో సుకుమార్ ఎప్పుడూ కాస్త కొత్తగానే ఆలోచిస్తాడు. సో.. రేపల్లె అనే టైటిల్ ను ఫిక్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు ధృవ సినిమాతో ట్రాక్ మార్చిన చెర్రీ కూడా కొత్త పాత్రలు, కొత్త టైటిల్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చెర్రీ సినిమాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టే చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే ఆలోచనలో యూనిట్ ఉంది.

చెర్రీ-సుక్కూ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో పవన్ నటించిన అత్తారింటికి దారేది టైటిల్ ను సమంతానే రివీల్ చేసేసింది. అదే అత్యుత్సాహంతో చెర్రీ సినిమా టైటిల్ ను కూడా సమంత బయటపెడుతుందేమో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది.

Show comments