వీరీ వీరీ గుమ్మడి పండు.. వీరెవరు?

టాలీవుడ్ లో మత్తు మందుల వ్యవహారానికి సంబంధించి కొంతమందికి నోటీసులు ఇచ్చారని వార్తలు బయటకు వచ్చిన దగ్గర నుంచి మీడియాలో రకరకాల వార్తలు రావడం ప్రారంభమైంది.

రకరకాల హింట్స్ తో ఎవరెవరి గురించో హింట్స్ ఇస్తున్నారు. ఆ హింట్స్ ప్రకారం ఎవరై వుంటారో మరి?

చకచకా సినిమాలు ఫినిష్ చేసే అలవాటు వున్న డాషింగ్ డైరక్టర్ అంట..

మాంచి హాట్ అయిటమ్ లు చేసిన ఓ అయిటమ్ గాళ్ అంట

ఇండస్ట్రీలో మాంచి గాయనిగా పేరు తెచ్చుకున్న ఆమె భర్త అంట.

బాలనటుడిగా ప్రారంభించి హీరోగా ఎదిగిన ఓ నటుడు అంట.

ఇప్పుడు ఫామ్ లో లేకున్నా ఏడాది క్రితం వరకు సినిమాలు చేసిన పంజాబ్ కు చెందిన ఓ హీరోయిన్ అంట.

సినిమా ఫంక్షన్లలో డబ్బా స్పీచ్ లు ఇవ్వడంలో ఆరితేరిన నిర్మాత అంట.

ఇలా హింట్ లు ఇస్తూ వార్తలు వస్తుంటే, జనాలు ఎవరి ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. నోటీసులు ఇచ్చింది ఎక్సయిజ్ పోలీసులు. అందుకున్న వారికి తప్ప మరెవరికీ తెలియదు ఎవరెవరికి అందాయో? మరి ఈ తరహా హింట్స్ తో లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో? వీరెవరో?

Show comments