సూపర్ స్టార్ సిస్టర్ డైరక్షన్

చాన్నాళ్ల క్రితం తెరపై మెరుపులా మెరిసింది సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్ మంజుల. ఆ తరవాత మూడు నాలుగు సినిమాలు చేసింది కానీ, కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. నిర్మాతగా కూడా సినిమాలు చేయడం అపేసింది. 

అయితే లేటెస్ట్ గా ఆమె డైరక్టర్ సీట్లోకి వస్తున్నారట. ఓ మాంచి సెన్సిటివ్ లవ్ స్టోరీని తయారు చేసుకున్న మంజుల, ఆ సబ్జెక్ట్ ను తన డైరక్షన్ లోనే తెరకెక్కించే పనిలో వున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను ఆమే నిర్మిస్తారో, వేరే నిర్మాత వున్నారో తెలియాల్సి వుంది. డైరక్షన్ అయితే మాత్రం మంజులనే చేస్తారు.

ఈ సబ్జెక్ట్ తీసుకుని, శర్వానంద్, నాని తదితర యంగ్ హీరోలకు వినిపించారట. మరి ఏమయిందో? వాళ్లకు ఎందుకు కుదరలేదో కానీ, ఆఖరికి సందీప్ కిషన్ దగ్గర సెటిల్ అయ్యారట. సో, సందీప్ తో సినిమ సక్సెస్ అయితే తెలుగు తెరకు మరో సక్సెస్ ఫుల్ లేడీ డైరక్టర్ పరిచయం అయినట్లే. ఇప్పటికే నందినీ రెడ్డి, బి జయ, జీవిత రాజశేఖర్ తదితర లేడీ డైరక్టర్లు వున్నారు.

Show comments