ఈసారి పవన్ షో శ్రీకాకుళంలో?

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఒక సినిమాలు చేసుకుంటూనే, అప్పుడప్పుడు ట్వీట్ లతో జనాల్ని పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమావాస్యకు పున్నానికి చేసే ఈ ట్వీట్లను ఎవరూ పట్టించుకోవడం పెద్దగా లేదు. నాయకులకు జనంలోకి వెళ్లడమే అల్టిమేట్ విషయం అన్నది తెలిసిందే. అయితే పవన్ ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు.

తిరపతి, కాకినాడ, అనంతపురం అయింది, ఇప్పుడు తరువాతి స్పాట్ శ్రీకాకుళం ఫిక్సయింది. జనవరి మూడున ఆయన శ్రీకాకుళంలో పబ్లిక్ మీటింగ్ లో, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని ఉత్తరాంధ్ర నుంచి వార్తలు అందుతున్నాయి. ఇందుకోసం పవన్ రెండవ తేదీ సాయంత్రం విశాఖ చేరుకుని, నోవాటెల్ హోటల్ లో ఆ రాత్రి వుంటారు.

ఎందుకంటే శ్రీకాకుళంలో పవన్ వుండగలిగిన రేంజ్ హోటళ్లు లేవు. మొన్నటికి మొన్న కాకినాడలో అంటే జీఆర్టీ లాంటి స్టార్ హోటల్ వుంది కాబట్టి అక్కడ బస చేగలిగారు.విశాఖలో ప్రస్తుతానికి ఇదే ఖరీదైన హోటల్. ఇక్కడ బసచేస్తేనే గతంలో జగన్ ను తెలుగుదేశం జనాలు విమర్శించారు. మర్నాడు మార్నింగ్ నే బయల్దేరి రోడ్ దారిన శ్రీకాకుళం వెళ్తారట. ఈసారి పవన్ ప్రసంగంలో ఏం వింతలు వుంటాయో..వింటే కానీ తెలియదు.

Readmore!
Show comments

Related Stories :