జగన్‌ ఆపితే ఆగిపోయింది.!

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. మంత్రి అవకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు. భూమా నాగిరెడ్డి మంత్రి అవకపోవడానికి కారణం ఎవరో కాదట, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగనే. ఈ విషయాన్ని స్వయంగా సెలవిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చంద్రబాబు ఎన్ని కథలైనా చెబుతారు మరి.! 

ఏడాది క్రితమే 'మూడు రోజుల్లో మంత్రి పదవి' ఆనే ఆఫర్‌ ఇచ్చి, భూమా నాగిరెడ్డినీ ఆయన కుమార్తెనూ తెలుగుదేశం పార్టీలోకి లాగేశారు చంద్రబాబు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని కోరడం అనేది సాధారణమైన ప్రక్రియే. అదే పని వైఎస్సార్సీపీ చేసింది. పార్టీ ఫిరాయించినోళ్ళకు మంత్రి పదవులెలా ఇస్తారు.? అని జగన్‌ ప్రశ్నించడం తప్పయిపోయిందట. జగన్‌ అలా ప్రశ్నించడం వల్లే భూమా నాగిరెడ్డికి, చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేకపోయారట. నమ్మేలా వుందా, చంద్రబాబు లాజిక్కు.! 

అవును మరి, జగన్‌ ఆపితే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ ఆగిపోయింది.. జగన్‌ కాదంటే, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం ఆగిపోయింది.. జగన్‌ గగ్గోలు పెడితే, పార్టీ ఫిరాయింపులు ఆగిపోయాయ్‌.. అలాగే, పార్టీ ఫిరాయించినోళ్ళకి మంత్రి పదవులు కూడా ఆగిపోయాయ్.. మాట్లాడేముందు కాస్తన్నా విజ్ఞత వుండాలి కదా.! అఫ్‌కోర్స్‌, ఆ విజ్ఞతే వుంటే, ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు.?

Show comments