బాబుకు ఇంకో బకరా ‘రెడ్డి’ కావలెను!

చంద్రబాబు ఇలాంటి సమీకరణాలను వేయడాన్ని ఈతరం నిక్కర్లేసుకున్నప్పటి నుంచి గమనిస్తూనే ఉంది. ఏ కులం రాజకీయ ప్రత్యర్థిని ఆ కులం వారితోనే తిట్టించడం అనే పచ్చి కుల సమీకరణానికి ఆద్యుడు చంద్రబాబునాయుడు. ప్రస్తుతం కూడా తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రత్యర్థులను తిట్టడమే పనిగా ఉండే కొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో పెద్ద పని జగన్ ను తిట్టడమే కాబట్టి... ఈ పని కోసమే కొందరు ప్రత్యేకంగా నియమితులై ఉన్నారు. వీరిలో కొందరు రెడ్డి కులస్తులున్నారు. వీళ్లు జగన్ ను తితుడూ ఉంటే చంద్రబాబుకు అదో ముచ్చట. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి వంటి వాళ్లు ఊసులో ఉన్నారంటే.. అది కేవలం జగన్ ను తిట్టడానికి మాత్రమే. 

గతంలో రేవంత్ రెడ్డి ఈ విధందా దేకేవాడు. అయితే ఇప్పుడు రేవంతుడు.. ‘రెడ్ల జనోద్ధరణకు’ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు. మరి తెలంగాణలో రెడ్లను అణచివేస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేసే రేవంత్ రెడ్డి.. చంద్రబాబు చేతిలో ఎందుకు పావుగా ఉంటాడో ఆయనకే తెలియదు పాపం! మరి ఆ సంగతులన్నీ అలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అర్జెంటుగా ఒక ‘రెడ్డి’ నేత అవసరం పడ్డాడట. ఆయనను ఏకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేస్తారట. ప్రత్యేకించి ఆ రెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తే అయ్యుండాలట! కడప జిల్లాకుచెందిన వ్యక్తి అయితే ఇంకా మేలట. మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు వేరే వాళ్లకు ఇచ్చి బాబు ఎక్కడికి వెళ్తున్నారు? అనే సందేహాలేమీ వద్దు. బాబు ఉంటారు.. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్ష విభాగానికి సదరు ‘రెడ్డి’ని అధ్యక్షుడిగా చేస్తారనమాట. 

ఆ పదవి పవర్ గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఆ మధ్య తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా తెలుగుదేశం వాళ్లే ప్రపంచానికి పరిచయం చేసినప్పటి నుంచి అదో పదవి ఉంది. ఆ జగద్విఖ్యాత పదవిలో రెడ్డి కులస్తుడిని కూర్చోబెట్టాలని చంద్రబాబుకు అనిపిస్తోందట. పదమూడు జిల్లాల్లో విస్తరించిన ఈ జాతీయ పార్టీకి చంద్రబాబు, లోకేష్ బాబులు అన్ని అధికారాలనూ అనుభవించాకా మిగిలిన.. ఉత్సవ విగ్రహం పాత్ర అది. ఆ ఉత్సవ విగహ్రంగా రెడ్డిని కూర్చోబెట్టేసి.. జగన్ ను ఎదుర్కొనబోతున్నాడట చంద్రబాబు. సూపర్ ప్లాన్ కదూ! ఎలా వస్తాయండీ ఇలాంటి అవిడియాలు! ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నాయన.. నాకు అధికారాలు లేవు, నన్ను పట్టించుకోరు.. అంటూ బోరుమంటున్నాడు. 

ఆయనను కేబినెట్ లోకి తీసుకుని.. ఆ పవర్ ఫుల్ పదవిలో రాయలసీమ రెడ్డిని కూర్చోబెట్టి రాజకీయం చేస్తారట.. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఒక బకరా కావాలి, కచ్చితంగా రెడ్డి కులానికి చెందినదై ఉండాలి! దొరుకుతారులే! సీటు ఎక్కిన ఆవేశంలో వాళ్లు రెచ్చిపోతారు.. తర్వాత రేవంత్ రెడ్డిలా, సతీష్ రెడ్డిలా, ఆనం సోదరుల్లా, జేసీ సోదరుల్లా.. తమకు దక్కేది బీపీనే తప్ప.. ఇంకేం లేదని గ్రహిస్తారు. చూస్తూ ఉండాలంతే!

Show comments