మెగా మేనల్లుడూ కొత్తపేరు కనిపెట్టాడు

యూ ట్యూబ్‌ హిట్స్‌ అనే ప్రస్తావన ప్లేస్‌లోకి డిజిటల్‌ వ్యూస్‌ అనే కొత్త పదం తెరపైకొచ్చింది. టీజర్‌కీ ట్రైలర్‌కీ మధ్యలో 'స్టంపర్‌' పుట్టుకొచ్చింది. టీజరూ కాదు, ట్రైలరూ కాదు, స్టంపరూ కాదు.. 'ప్రిల్యూడ్‌' అని కొత్త పేరుని తీసుకొచ్చాడు మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ. పేరు 'ప్రిల్యూడ్‌' అయినా, ఇది టీజరే. కాస్త కొత్తదనం కోసం 'జవాన్‌' సినిమా కోసం ఈ కొత్త పదాన్ని పరిచయం చేశారు. 

ఇంతకీ, ఈ ప్రిల్యూడ్‌ ఎలా వుందంటే, ఇందులో దేశభక్తిని నింపేశాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే సినిమా సినిమాకీ మేకోవర్‌ మార్చేస్తోన్న సాయిధరమ్‌ తేజ, ఈ 'జవాన్‌' కోసం కూడా మారాడు. ఇంకొచెం స్టైలిష్‌గా తనను తాను మార్చుకున్నాడు. దేశభక్తి చుట్టూ రెండు మూడు డైలాగుల్ని టీజర్‌లో.. అదేనండీ, ప్రిల్యూడ్‌లో చెప్పేశాడండోయ్‌. 

మాంఛి స్పీడ్‌ మీదున్న టైమ్‌లో 'తిక్క' సినిమా పెద్ద బ్రేకేసింది సాయిధరమ్‌తేజకి. అంతకు ముందు 'సుప్రీం' సినిమా ఇచ్చిన కిక్‌తో మనోడి కాన్ఫిడెన్స్‌ ఓ రేంజ్‌కి చేరితే, 'తిక్క' సినిమాతో మొత్తంగా ఆ కాన్ఫిడెన్స్‌ ఢమాల్‌ అయిపోయింది. 'విన్నర్‌' సినిమా కూడా మరో షాక్‌ ఇచ్చింది సాయిధరమ్‌ తేజకి. ఈ టైమ్‌లో 'జవాన్‌' మీదనే మనోడు ఆశలన్నీ పెట్టేసుకున్నాడు. 

టీజర్‌ స్థానంలో ప్రిల్యూడ్‌ అన్నాడు, స్టైల్‌ దగ్గర్నుంచి అన్నీ మార్చేశాడు.. మరి, ఇవన్నీ అతన్ని సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిస్తాయా.? వేచి చూడాల్సిందే.

Show comments