హీరో భార్యకు బాయ్ ఫ్రెండ్స్.. చాలా ఎక్కువేనట!

వివాహేతర సంబంధాలు, వివాహపు పూర్వపు సంబంధాలు.. వంటి అంశాల గురించి చర్చకు రచ్చబండ గా మారిన ‘కాఫీ విత్ కరణ్’ లో ఎవ్వరినీ వదలడం లేదు. సినీ రంగానికి సంబంధించిన పాపులర్ వ్యక్తుల ప్రేమాయణాల గురించి వారితోనే చర్చించే ఈ కార్యక్రమంలో ఇప్పుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ సమాధానాలు చర్చనీయాంశంగా మారాయి.

వచ్చే వారం షాహిద్- మీరాలతో కరణ్ చాట్ షో ప్రసారం కానుంది. అందుకు సంబంధించి ట్రయల్ పార్టులో ఆసక్తికరంగానే ఉంది. ప్రత్యేకించి వివాహానికి పూర్వం లవర్ బోయ్ ఇమేజ్ తో ప్లేబాయ్ ల గడిపిన షాహిద్ ప్రేమ వ్యవహారాల గురించే గాక, వివాహానికి పూర్వం ఎవరూ ఎరగని మీరా ప్రేమాయణాల గురించి కూడా చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో.

వివాహానికి ముందు ప్రేమ కథల మాటేంటి? అని మీరాను షాహిద్ అడుగగా.. ఆమె, వాటి గురించి  షాహిద్ కు పూర్తిగా చెప్పేశానని అంది, అతడు తనకు అన్నీ చెప్పాడని, తను కూడా అతడికి అన్నింటినీ చెప్పేశానని మీరా వివరించింది. అయితే కరణ్ కు ఇంతటితో సంతృప్తి లేకపోవడంతో.. సూటిగా అడిగాడు, పెళ్లికి ముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? అని, దానికి సమాధానం మీరా నుంచి రాలేదు, షాహిద్ నుంచి వచ్చింది. “ నా కన్నా తక్కువేం కాదు..’’ అంటూ భార్య గురించి బ్రహ్మాండమైన ఇన్పర్మేషన్ ఇచ్చి పకపకా నవ్వాడు షాహిద్ కపూర్. ఇదంతా ట్రైలర్ పార్టే.. అసలు కథ జనవరి ఒకటో తేదీనట! 

Show comments