పవన్ అడిగినా చెప్పలేనంటున్న రాశి

ఒకప్పటి నటి, ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాశి, రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించింది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై, అతడు పెట్టిన జనసేన పార్టీపై రాశి రెస్పాండ్ అయింది. గతంలో పవన్ కల్యాణ్ తో కలిసి గోకులంతో సీత సినిమా చేసింది రాశి. మళ్లీ ఇన్నేళ్లకు పవన్ ను వ్యక్తిగతంగా కలిసింది. ఈ గ్యాప్ లో పవన్ చాలా మారిపోయాడంటోంది ఈ మాజీ హీరోయిన్. 

గోకులంలో సీత టైమ్ లో పవన్ అస్సలు తనతో మాట్లాడేవాడు కాదని, ఇప్పుడు మాత్రం ఏకథాటిగా మాట్లాడేస్తున్నాడని రాశి ఆశ్చర్యపోయింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ చాలా మారిపోయాడని, అయితే వ్యక్తిగతంగా మాత్రం ఇప్పటికీ పవన్ చాలా మంచి మనిషని, అతనంటే చాలా ఇష్టమని అంటోంది రాశి. పవన్ పిలిస్తే రాజకీయాల్లోకి వెళ్తారా అనే ప్రశ్నకు మాత్రం రాశి సమాధానం దాటేసింది.

తనకు రాజకీయాలంటే అస్సలు పడవని, ఈ విషయంలో పవన్ కోరినా తను సమాధానం చెప్పలేనని అంటోంది రాశి. జగన్ ను కూడా కలిశానని, కానీ తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని అంటోంది. ప్రస్తుతం లంక అనే సినిమా చేసింది రాశి. మరిన్ని క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు ఎదురుచూస్తోంది.

Readmore!
Show comments

Related Stories :