ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి పాలన ఎలా ఉందనే అంశంపై 'గ్రేట్‌ఆంధ్ర' నిర్వహించిన పోల్‌లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. కొన్ని వేలమంది నెటిజన్లు భాగస్వాములయిన ఈ పోల్‌లో మెజారిటీ మెంబర్స్ పెదవి విరచడం గమనార్హం. బాబుపాలన ఎలా ఉందనే అంశంపై నాలుగు రకాల ఛాయిస్‌లు ఇచ్చి ఈ పోల్‌ను నిర్వహించడం జరిగింది.
ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, ఫెయిల్యూర్.. అనే ఛాయిస్‌లతో పోల్ సాగింది. వీటిల్లో 'ఫెయిల్యూర్' అనే ఎంపికను మెజారిటీ నెటిజన్లు ఎంచుకున్నారు. 47.94శాతం మంది నెటిజన్లు మూడేళ్ల బాబుపాలన ఒక ఫెయిల్యూర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోల్‌లో వీరిదే మెజారిటీ.
బాబుపాలన యావరేజ్‌గా ఉందని అభిప్రాయపడిన వారి శాతం 13.25. బాబుపాలన బాగుందని అభిప్రా యపడిన వారి శాతం 13.84గా ఉంది. ఇక బాబు పాలన అద్భుతంగా ఉందన్న వారి శాతం 24.97.
ఇదీ పోల్ సరళి. మెజారిటీ నెటిజన్లు బాబుపాలన బాగోలేదని, పాలకుడిగా ఆయన ఫెయిలయ్యారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ర్యాండమ్ శాంపిల్స్‌తో, కొన్ని వేలమంది నెటిజన్ల అభిప్రాయాల కూర్పు అయిన ఈ ఫలితాన్ని ప్రభుత్వ పనితీరుకు సమీక్షగా పరిగణించవచ్చు. ల్యాండ్ డీల్స్ విషయంలో ఎవరు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు?
ఉభయ తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భూ కబ్జాలు, భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కుంభకోణాల్లో ఎవరు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునా, తెలంగాణ సీఎం చంద్రబాబునా అనే అంశంపై నెటిజన్లు ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. ఇద్దరూ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారా, ఇద్దరూ వాళ్ల నేతలను కాపాడుకున్నారా? అనే అంశాలపై గ్రేట్‌ఆంధ్ర నిర్వహించిన పోల్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
-కేసీఆర్ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాడని 23.21శాతం మంది అభిప్రాయపడ్డారు.
-బాబు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాడని 20.05శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
-ఇద్దరూ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని 6.53శాతం మంది నెటిజన్లు పేర్కొన్నారు.
-మెజారిటీ నెటిజన్లు మాత్రం ఇద్దరి విషయంలోనూ పెదవి విరిచారు. ఇద్దరు సీఎంలూ తమ తమ వారిని కాపాడుకొంటున్నారని అభిప్రాయపడ్డారు. వీరి శాతం 49.77 కావడం గమనార్హం.
ఈ భూ కుంభకోణాల విషయంలో ఇద్దరు సీఎంలూ మెజారిటీ ప్రజల మద్దతును కోల్పోయారని స్పష్టం అవుతోంది.