థమన్ కు ఎందుకు సినిమాలు?

సేమ్ టు సేమ్ మ్యూజిక్ ఇస్తాడని క్రిటిసిజమ్ వుంది. కానీ ప్రతి సినిమాలో ఏదో ఒక్క పాట హిట్ చేసుకుని, సినిమాల మీద సినిమాలు అందేసుకుంటున్నాడు థమన్. టాలీవుడ్ లో దేవీ, థమన్ తరువాతే మరే ఛాయిస్ అయినా, దేవీ సంగతి అలా వుంచితే, రిపీట్ మ్యూజిక్ ఇస్తాడని, ఆల్బమ్ గ్యారంటీ లేదని చాలా సార్లు ప్రూవ్ అయింది థమన్ విషయంలో. 

అయినా కూడా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వున్నాడు. దీని వెనుక చాలా ఇంట్రస్టింగ్ సంగతే వుందట. థమన్ జస్ట్ యాభై లక్షలకే సినిమా చేయడం అన్నదే ఆ ఇంట్రస్టింగ్ విషయం. థమన్ మ్యూజిక్ ఎలా వున్నా, అతని పేరు ఏడ్ అయితే సినిమాకు కాస్త పెద్ద టెక్నీషియన్ వున్నట్లు అవుతుంది. అలాంటి టెక్నీషియన్ జస్ట్ 50 లక్షలకే వస్తుంటే ఎందుకు వదులుకుంటారు ఎవరైనా? 

మరోపక్క దేవీ ఏమో కోటి దాటేసాడు రెమ్యూనిరేషన్ విషయంలో అని వినికిడి. అనూప్, ఆ రేంజ్ జనాలు కూడా ముఫై నుంచి యాభై తీసుకుంటున్నారు. అలాంటపుడు థమన్ బెటర్ చాయిస్ అనుకుంటున్నారట సినిమా జనాలు. అదీ థమన్ వెనుక వున్న సీక్రెట్ అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల మాట.

Show comments