పవన్‌కళ్యాణ్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. డైరెక్టర్ విషయంలో మాత్రం ఇంకా కన్‌ఫ్యూజన్ కొనసాగుతోంది. అధికారికంగా చిత్ర నిర్మాత శరద్‌మరార్, పవన్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా ఎంపికయ్యిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించేయడం బాగానే వుందిగానీ, డాలీ ఈ చిత్రానికి దర్శకుడన్నది పక్కాయేనా.?
'ఖుషి', 'కొమరం పులి' చిత్రాల ఫేంఎస్‌జె సూర్యని తీసేసి (తనంతట తానుగా వెళ్ళిపోయాడట.. మహేష్ సినిమాలో విలన్‌గా ఛాన్స్ రావడంతో అన్నది ఓ వాదన) 'గోపాల గోపాల' ఫేం డాలీని ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేసిన విషయం విదితమే. అయినప్పటికీ, ఇంకా దర్శకుడి విషయంలో రకరకాల గాసిప్స్ విన్పిస్తున్నాయి. డైరెక్టర్ విషయంలో పవన్‌కి క్లారిటీ లేకపోవడంతో, నిర్మాత సైతం ఏమీ చేయలేని పరిస్థితి.
తాజాగా శరద్‌మరార్ చెబుతున్నదాన్నిబట్టి ఆగస్ట్‌లో పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశముంది. షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా దర్శకుడు డాలీయేనా.? అన్నదానిపై యధాతథంగా కన్‌ఫ్యూజన్ కొనసాగుతుంది. ఎందుకంటే, అక్కడున్నది పవన్‌కళ్యాణ్ కదా. అదే మరి, అసలు సమస్య.