బికినీలో ఆంటీ కెవ్వు కేక.!

బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా ఖాన్‌, తెలుగులో 'కెవ్వు కేక..' అంటూ పవన్‌కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్‌' సినిమాలో ఆడిపాడిన విషయం విదితమే. వయసు మీద పడ్తున్నా వన్నెతరగని అందం ఆమె సొంతం. ఐటమ్‌ బాంబ్‌లా ఇప్పటికీ మలైకా అరోరా ఖాన్‌ తిరుగులేని ఇమేజ్‌ని కొనసాగిస్తోందంటే అదంతా ఆమె 'ఫిగర్‌' కారణంగానే.! 

మలైకా అరోరా ఖాన్‌ తాజాగా, మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్‌ చేసేసింది.. అదీ తన కుమారుడితో కలిసి. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసేసిందామె. అఫ్‌కోర్స్‌.. ఈ మధ్య బికినీ ఫొటోలకి సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలు ఎడిక్ట్‌ అయిపోయారనుకోండి.. అది వేరే విషయం. ఆ లిస్ట్‌లో మలైకా అరోరా ఖాన్‌ కూడా చేరిపోయిందంతే. 

గతంలో సినిమాల్లోనే అందాల భామలు బికినీలతో దర్శనమిచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులకి సూపర్‌ కిక్‌ ఇచ్చేస్తున్నారు. మాల్దీవుల్లో సముద్రం సూపర్బ్‌గా ఉంటుంది. అక్కడ ఎంజాయ్‌మెంట్‌ అంటే బాలీవుడ్‌ జనాలకి ఓ రేంజ్‌ కిక్‌ వుంటుంది. అందుకేనేమో మలైకా అరోరా ఖాన్‌, బికినీలో ఫొటోలకు పోజులిస్తూ, తనయుడితో కలిసి సముద్రంలో ఈత కొడుతూ, యోగాసనాలు వేస్తూ.. అభిమానులకు ఇలా హీటెక్కించేసింది.

Show comments