'ఇది మరీ టూమచ్..' అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి.. కేరళలో అల్లు అర్జున్ అభిమానులు చేస్తున్న హంగామా చూస్తే ఎవరికైనా సరే 'షాక్' తగలకమానదు. నిజమే మరి, ఆ స్థాయిలో అల్లు అర్జున్ తన పాపులారిటీ, అభిమాన గణాన్నీ పెంచుకున్నాడు. తెలుగు తర్వాత అల్లు అర్జున్‌కి, మలయాళ సినీ మార్కెట్ చాలా పెద్దదయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
ఇక, అల్లు అర్జున్‌తోపాటు అతని సోదరుడు అల్లు శిరీష్ కూడా మలయాళ సినీ పరిశ్రమలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మన 'మల్లు' అర్జున్ సోదరుడు 'మల్లు' శిరీష్ హీరోగా వచ్చేస్తున్నానడంటూ, అల్లు అర్జున్ అభిమానులు కేరళలో బీభత్సమైన హంగా చేసేస్తున్నారు హోర్డింగుల్లో. '1971 బియాండ్ బోర్డర్' అనే సినిమాలో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఏర్పాటు చేస్తున్న హోర్డింగుల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఫొటోలు చిన్నబోతున్నాయి. హోర్డింగులు చూస్తే, ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తున్నాడా.? అన్న అనుమానం కలగకమానదు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో అల్లు అర్జున్ ని పోల్చడం సరికాదుగానీ, అల్లు అర్జుకి మలయాళంలో వున్న ఫాలోయింగ్ పుణ్యమా అని, అక్కడ అల్లు శిరీష్‌కి కూడా మంచి ఫాలోయింగ్ వచ్చే అవకాశాలైతే లేకపోలేదు.