సింహాద్రికి 13 ఏళ్లు

ఎన్టీఆర్ సినిమాల్లో సింహాద్రిది ఓ ప్రత్యేక మైన స్థానం. స్క్రీన్ మీద ఎమోషన్లు పిచ్చ పీక్స్ లో పండించగల దర్శకుడు రాజమౌళి డైరక్షన్ లో జూనియర్ సినిమా ఇది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, స్టార్ ఇమేజ్ ను ఓ రేంజ్ కు చేర్చేసింది. ఈ సినిమా విడుదలై 13 ఏళ్లయింది. అంటే పుష్కరకాలం దాటేసిందన్నమాట.  

అందుకే ఈ రోజు ఎన్టీఆర్ ఈ విషయాన్ని తన సన్నిహితులతో గుర్తుచేసుకున్నాడట. ఆ తరువాత కూడా అనేక విజయాలు తనను వరించాయి కానీ, సింహాద్రి మాదిరిగా తనలోని అన్ని కోణాల నటనను బయటకు తీసిన సినిమా మాత్రం లేదన్నది ఎన్ఠీఆర్ ఫీలింగ్ గా తెలుస్తోంది. 

ఆ మాట కూడా కాస్త నిజమే అనుకోవాలి. అయితే ఇక్కడ మళ్లీ రాజమౌళి యమదొంగ మినహాయింపు. ఎందుకంటే, ఆ సినిమా కూడా ఎన్టీఆర్ లో నవరసాల నటనను బయటకు తీసింది కదా? మళ్లీ ఈ సూపర్ డూపర్ రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ ఎప్పుడో?

Show comments