ఆ ‘డ్రీమ్’ నెరవేరడం లేదు

నాగ్ తో మాంచి సినిమా తీద్దాం అనుకున్నారు ఐ డ్రీమ్ అధినేతలు. కానీ ఆ డ్రీమ్ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ప్రేమమ్ సినిమా తరువాత డైరక్టర్ చందు మొండేటి చెప్పిన లైన్ విని ఓకె చేసేసారు నాగ్. అదే సమయంలో చందు తన మలి సినిమా ఐడ్రీమ్ అధినేతలకు చేయాల్సి వుంది కాబట్టి, ఆ ప్రాజెక్టు డిస్కషన్ లోకి వచ్చింది. ఇదే సినిమాలో యంగ్ హీరో క్యారెక్టర్ కూడా వుంది. అది నిఖిల్ చేస్తాడు అనుకున్నారు. అదే విధంగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను కూడా హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కాస్త లేట్ అయ్యేటట్లు వుంది. దీనికి రెండు కారణాలు అంటున్నారు. ఒకటి ప్రస్తుతం నాగ్ చేస్తున్న రాజుగారి గది 2 సినిమా వర్క్ జూన్ వరకు వుండడం. రెండవది నాగ్ తనకు ఇష్టమైన బంగార్రాజు క్యారెక్టర్ ఎక్స్ టెన్షన్ తో చేయదలుచుకున్న సినిమాను ఈ ఏడాది ఎలాగైనా ఫినిష్ చేసి, వచ్చే సంక్రాంతికి తేవాలని డిసైడ్ అయిపోవడం.

ఈ రెండు కారణాల వల్ల నాగ్ ఓకె చేసిన చందు మొండేటి స్క్రిప్ట్ ను పక్కన పెట్టినట్లు వినికిడి. ఈ లోగా చందు అండ్ ఐడ్రీమ్ జనాలు కలిసి వేరే ప్రాజెక్టు సెట్ చేసుకునే పనిలో వున్నారు. 

Show comments