ఈ రోజుకు ప్రణబ్ ను వాడేసిన పచ్చమీడియా!

జనాలు చదివితే నవ్వుకుంటారు.. అనే మొహమాటాలు ఏనాడు ఉన్నాయి గనుక.. కొత్తగా ఈ రోజు మొహమాటపడటానికి! ఇదంతా ఈ భజంత్రీ మీడియాకు అలవాటే. ఎందరినో వాడేశారంట.. ప్రణబ్ ముఖర్జీ ఒక లెక్కనా! బాబులాంటి వాళ్లు ఏపీ కి మాత్రమే ఉంటే సరిపోదు.. రాష్ట్రానికి ఒకరుండాలి అన్నారట ప్రణబ్ ముఖర్జీ. అలా ఉంటే గనుక దేశం ఇట్టే అభివృద్ధి జరిగిపోతుందని ఆయన చెప్పారట! పచ్చమీడియాకు మాత్రమే ఈ మాట వినిపించినట్టుగా ఉంది.. ఇంకేముంది.. దీనిపై ఫస్ట్ పేజీ నుంచే ఒక స్పెషల్ స్టోరీ!

మరి బాబును పొగిడారంటూ.. ఇప్పటికే చాలామంది ప్రముఖులను వాడేసి ఈ పచ్చమీడియా వారిని పతాక శీర్షికలకు ఎక్కించి జనాల చెవుల్లో పూలు పెట్టింది. ఈ జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అధినేతలు ఉన్నారు. ఆ అంతర్జాతీయ స్థాయి నుంచి దిగి వచ్చి.. దేశం స్థాయిలో ప్రణబ్ ను ఈ రోజుకు వాడేశారు!

అయినా.. అందరూ బాబులా పని చేయడం అంటే ఏమిటి? ప్రత్యేక విమానాలేసుకుని విదేశాల్లో విహరించడమా?  ఇచ్చిన ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమా? ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసేయడమా? ఏపీ విషయంలో పార్లమెంటు ఇచ్చిన హామీలు, ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు అమలు కాకపోయినా ప్రశ్నించకపోవడమా? ఇంతకీ బాబులో ప్రణబ్ కు నచ్చిన ఆ క్వాలిటీలు కూడా వివరించి ఉంటే బాగుండేది. 

Show comments