అమ్మతో కలిసి సిన్మా చూసిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ తన లేటెస్ట్ సినిమా జనతా గ్యారేజ్ ను అందరి కన్నా ముందుగానే చూసేసారు. ఈ సాయంత్రం ఆయన తన తల్లితో, భార్యతో కలిసి ప్రత్యేకంగా షో వేయించుకుని చూసారు. ఆయన తో పాటు సినిమా నిర్మాతల కుటుంబ సభ్యులు కూడా జనతా గ్యారేజ్ ను వీక్షించారు. సినిమా చూసి,ఎన్టీఆర్ తల్లి చాలా హ్యాపీగా ఫీలయినట్లు తెలుస్తోంది. 

మంచి సినిమా చేసావని, చాలా బాగుందని ఆమె అన్నట్లు తెలుస్తోంది.  ఎన్టీఆర్ తన సినిమాను విడుదలకు ముందు ఫ్యామిలీతో చూడడం చాలా రేర్. జనతా గ్యారేజ్ కు వచ్చిన హైప్, దానిపై వున్న అంచనాలు ఇవన్నీ కలిసి ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా ముందుగా చూడాలన్న ఉత్సాహాన్ని కలిగించాయి. దాంతో సాయంత్రం ప్రత్యేకంగా షో ప్రదర్శించారు.

Show comments