సినిమా నిర్మాణంలోకి హీరో నాని

దాదాపు టాలీవుడ్ హీరోలంతా ఏదో విధంగా, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిర్మాణంలో పాలు పంచుకుంటున్నవారే. ఏరియా హక్కులు, శాటిలైట్ హక్కులు లేదా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటున్నవారే. చాలా మంది స్వంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకుని, తమ అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మించిన వారే. ఇది ఇవ్వాల్టి నిన్నటి వ్యవహారం కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నాటి నుంచి వస్తోంది. 

ఈ యంగ్ జనరేషన్ లో మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా స్వంత భ్యానర్ లు స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరో జాయిన్ కాబోతున్నారు.  వైవిధ్యమైన సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ, యూత్ లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నాని కూడా త్వరలో నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు. అయితే ఆయన నేరుగా కాకుండా, తమ బంధువులతో కలిసి ఓ బ్యానర్ స్టార్ట్ చేసారు. ఆ బ్యానర్ పై ఆయన వచ్చే ఏడాది ఓ సినిమా నిర్మించబోతున్నారు. 

నాని హీరోగా నటించే ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం వుంది. ఆ సినిమాకన్నా ముందుగా అవసరాల ఓ సినిమా స్క్రిప్ట్ ను వెంకీ కోసం తయారుచేసే పనిలో వుంటారు. అదే విధంగా ఈలోగా నాని ఒకటి రెండు సినిమాలు ఫినిష్ చేస్తారు. 

Show comments