పల్లె బాటలో సుకుమార్

జీవితాలు అన్నీ పట్టణాల చుట్టూ, స్మార్ట్ ఫోన్ల చుట్టూ తిరుగుతున్నాయి. అపార్ట్ మెంట్లలో, ఇరుకు గదుల్లో నాలుగు గోడలే తప్ప, పచ్చదనం అన్నది కంటికి కనిపించడం లేదు. ఒక్కసారి వెండితెరపై పచ్చని చేలు, పల్లెలు కనిపిస్తే, జనం ఫిదా అయిపోతున్నారు. దానికి తగ్గట్లు కథ కథనాలు వుంటే అక్కున పెట్టుకుంటున్నారు. అందుకే దర్శకుడు సుకుమార్ కూడా ఓసారి పల్లెటూరికి వెళ్లిరావాలనుకుంటున్నాడు. నిజానికి సుకుమార్ వచ్చింది తూర్పుగోదావరి లోని పల్లె నుంచే. అయితే సుకుమార్ పల్లెకు వెళ్లేది తనుగా కాదు. తన సినిమాతో.

అవును..రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సినిమా పల్లెటూరు నేపథ్యంలో వుండబోతోందని వినికిడి. సుకుమార్-చరణ్ కాంబినేషన్ లొ స్పై మూవీ, జేమ్స్ బాండ్ మూవీ అంటూ ఎవరికి తోచింది వారు చెప్పేస్తున్నారు. కానీ అది కాదు విషయం అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ వార్తలు చదివి సుక్కూ..చెర్రీ నవ్వుకుంటున్నారట. తమకు లేని అయిడియాలు వీళ్లు చేయడం చదివి.

చెర్రీతో మాంచి పల్లె నేపథ్యంలో సినిమా కథ తయారుచేసే పనిలో వున్నారు సుకుమార్ అని తెలుస్తోంది. అయితే దీంట్లో కాస్త అర్బన్ టచ్ కూడా వుంటుందని వినికిడి. అదీ సంగతి.

Readmore!
Show comments

Related Stories :