మైగా స్టయిల్..లైట్ తీస్కో

మొత్తానికి చిరంజీవి తాను పరమ డిప్లమాటిక్ పర్సన్ అని మరోసారి రుజువు చేసుకున్నారు. మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆర్జీవీ-నాగబాబు వ్యవహారం కానీ, పవన్ గైర్హాజరీ కానీ పెద్ద ఇస్యూలే కాదన్నట్లు తీసి పడేసారు. ఆర్జీవీ కామెంట్లను తానైతే పట్టించుకోనని, నాగబాబు హర్ట్ అయినట్లున్నాడు..అందకే రియాక్ట్ అయ్యాడేమో? హర్ట్ అయిన వారు రియాక్ట్ కావడం కామనే కదా అని అనేసారు మెగాస్టారు.అలాగే పవన్ ను రామ్ చరణ్ పిలిచాడు..పని వుంది రాలేనన్నాడు. పిలిచిన ప్రతీవాళ్లు రావాలనేం లేదు కదా? అనే తేల్చేసారు మెగా హీరో.

అక్కడ కనిపిస్తారట....

మెగా హీరోలంతా సరదాపడ్డారు చిరు 150వ సినిమాలో కనిపించాలని కానీ, అందరికీ అవకాశం ఇవ్వలేరు కదా? అందుకే షూటింగ్ సందర్భంగా మెగా హీరోలు వచ్చినప్పటి సీన్లు తీసి, స్క్రోలింగ్ టైటిళ్ల సమయంలో చూపించే పని చేసారట. సింపుల్ గా తేలిపోయింది కదా వ్యవహారం.

అంతా బాగానే వుంది కానీ, పక్కా మాస్ మసాలా పాటలు, డైలాగులు, ఫైట్లు చూపిస్తూ, అదే విధంగా ప్రచారం సాగిస్తూ, 150 వ సినిమాగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకున్నా, అందుకే ఈ రీమేక్ స్టోరీ ఎంచుకున్నా. నాకు వచ్చిన స్ట్రయిట్ కథలన్నీ కమర్షియల్ కథలే అని అంటారేమిటి చిరంజీవి.  ఈ సినిమా ప్రచారం అంతా కమర్షియాలిటీనే కనిపిస్తోందిగా?

Show comments