రామ్ చరణ్..అవసరమా ఇదంతా?

ఆదా శర్మకు ఓ అలవాటు వుంది..అప్పుడప్పుడు తన స్టిల్స్ వదుల్తుంటుంది..అదీ ముఖ్యంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులోనో, ముంబాయి ఎయిర్ పోర్టులోనో, వస్తున్నపుడో, వెళ్తున్నపుడో, భంగిమ..వన్..టూ..అంటూ. పాపం, సరైన హిట్ లేక, సరైన అవకాశాల్లేక కిందా మీదా అవుతోంది కాబట్టి, కాస్త ప్రచారం వస్తుందని ఇలా చేసింది అనుకోవచ్చు.. కానీ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన రామ్ చరణ్, మెగాస్టార్ లాంటి హీరోలకు ఎందుకో ఈ పబ్లిసిటీ తహతహ. 

ఈ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ ల పబ్లిసిటీ పాకులాట పీక్ కు వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికి ఎన్నిసార్లు రామ్ చరణ్ హైదరాబాద్  ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయి వుంటాడు..కనీసం వంద కు పైగానే అనుకోవాలి. అలాంటిది, ధృవ షెడ్యూలు ముగించుకుని హైదరాబాద్ రాగానే స్టిల్స్.. సారొచ్చారొచ్చారు.. అంటూ నోట్. తన బ్యాగ్ తను మోసుకువస్తున్న రామ్ చరణ్ స్టిల్స్. 

రామ్ చరణ్ కు ఈ స్టేజ్ లో ఇలాంటి ప్రచారం ఎందుకనో? ఆయన సినిమాకు ప్రచారం కొంత వరకు అవసరం కావచ్చు..అది కూడా ఇంకా ఇప్పటి నుంచీ కాదు, రిలీజ్ కు చాలా టైమ్ వుంది. దానికి గ్రాడ్యువల్ గా హైప్ తీసుకురావాలి.

ఇక చిరంజీవి 150 వ సినిమా వ్యవహారం కూడా ఇలాగే వుంది. ఆయనకు కూడా ఇటీవల పబ్లిసిటీ పీక్ లెవెల్లో అందించాలని చూస్తున్నారు. అటు అవార్డుల ఫంక్షన్ కావచ్చు..ఇటు 150 సినిమా కత్తిలాంటోడు షూట్ కావచ్చు..

వీటన్నింటి వెనుక రెండు కారణాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్, ఆయన తనయుడు తమకు పిచ్చ పబ్లిసిటీ కావాలని కోరుకుంటూ వుండి వుండాలి. లేదా సినిమా యూనిట్ జనాల తాలూకా అత్యుత్సాహం అయినా అయి వుండాలి. ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్..అది గుర్తుంచుకోవాలి..ఎవరైనా.

Show comments