గెట్‌ రెడీ ఫర్‌ ఎన్టీఆర్‌ 'బిగ్‌' షో

టీవీని బుల్లితెర అంటాం.. కానీ, కొన్ని 'షో'లు వెండితెరను మించిపోతుంటాయి. అలాంటిదే, 'బిగ్‌ బాస్‌' షో కూడా. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన 'బిగ్‌ బాస్‌' సూపర్‌ హిట్‌. రియాల్టీ షో అంటే, జస్ట్‌ వివాదాలు, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇంకోటేదో అనుకుంటుంటాం. 'బిగ్‌బాస్‌' షో అంతకు మించి అనే స్థాయిలో వుంటుంది. దానిక్కారణం, ఇందులోని 'హౌస్‌', అందులోని 'హౌస్‌మేట్స్‌'. 

హౌస్‌మేట్స్‌ ఎంపికతోనే, 'బిగ్‌ బాస్‌' షో సత్తా ఏంటనేదానిపై ఓ క్లారిటీ వస్తుంది. ఇక, హోస్ట్‌ సంగతి సరే సరి. తెలుగు బుల్లితెరపై తొలిసారిగా 'బిగ్‌ బాస్‌' షో సందడి చేయబోతోంది. ఇప్పటిదాకా ఇందులో 'హౌస్‌మేట్స్‌' ఎవరన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. హోస్ట్‌గా ఎన్టీఆర్‌ వ్యవహరిస్తుండడంతో, ఇంతకన్నా ఈ షోకి కావాల్సిన అదనపు పబ్లిసిటీ ఇంకేముంటుంది.? 

కనీ వినీ ఎరుగని స్థాయిలో 'బిగ్‌ బాస్‌' తెలుగు రియాల్టీ షోపై ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్‌ ఎలా బుల్లితెరపై మెగా షో చేయబోతున్నాడు.? హౌస్‌మేట్స్‌ ఎవరు.? ఎలాంటి వివాదాల్ని ఈ షోలో చూడబోతున్నాం.? ఇలా బోల్డన్ని ప్రశ్నలు బుల్లితెర వీక్షకుల మదిలో మెదులుతున్నాయి. అన్నిటికీ సమాధానం కొద్ది గంటల్లో దొరకబోతోంది. 

బిగ్‌ బాస్‌ హిందీ వెర్షన్‌ ఓ సంచలనం. అందులో వివాదాస్పద వ్యక్తులే అందుక్కారణం. ఇంటిమేట్‌ సీన్స్‌ తరహాలో లవ్‌ ప్రపోజల్స్‌ కూడా జరిగిపోయాయి బిగ్‌బాస్‌ హిందీ గత సీజన్లలో. ట్రాన్స్‌జెండర్లను తీసుకున్నారు, ఇంకా చాలా చాలానే చేసేశారు. అలా 'బిగ్‌బాస్‌' బుల్లితెర రియాల్టీ షోలకే బిగ్‌బాస్‌ అన్పించేసుకుంది. మరి, ఆ స్థాయిలోనే తెలుగు 'బిగ్‌బాస్‌'నీ ప్లాన్‌ చేశారా.? ఏమో మరి, కాస్సేపట్లో తేలిపోతుంది.  Readmore!

ఒక్కటి మాత్రం నిజం. హీరోగా వెండితెరపై హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకుపోతున్న టైమ్‌లో ఎన్టీఆర్‌ నుంచి వస్తోన్న బుల్లితెర మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'. వెండితెర సక్సెస్‌ని, బుల్లితెరపైనా ఎన్టీఆర్‌ హోస్ట్‌గా కొనసాగిస్తే, ఆయన అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.! ఎనీ వే గెట్‌ రెడీ ఫర్‌ ఎన్టీఆర్‌ 'బిగ్‌' షో.!

Show comments