ప్రేయసికి పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగమ్మాయి అంజలి, తమిళ హీరో జై ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలీదు కానీ ప్రస్తుతానికైతే ఇద్దరూ కలిసి చెన్నైలో ఒకటే ఫ్లాట్ లో ఉంటున్నారు. తమ మధ్య ఉన్న బంధాన్ని దాచే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. సమయం వచ్చినప్పుడుల్లా తమ ప్రేమను ఓపెన్ చేస్తూనే ఉన్నారు. 

మొన్నటికి మొన్న జై పుట్టినరోజు నాడు పెద్ద పండగే చేసింది అంజలి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సినిమా సెట్స్ పైకి వచ్చి, కేక్ కట్ చేయించి చాలా హంగామా చేసింది. 
ఈరోజు అంజలి పుట్టినరోజు. మరి తన ప్రేయసి పుట్టినరోజుకు జై ప్రత్యేకంగా ఏం చేశాడో తెలుసా..? అంజలికి శుభాకాంక్షలు తెలుపుతూ తన స్వదస్తూరితో ఓ లేఖ రాశాడు.

రియల్ లైఫ్ లో అంజలికి ప్రేమలేఖ రాశాడో లేదో మనకు తెలీదు కానీ, ఆమె పుట్టినరోజుకు మాత్రం ఓవైపు శుభాకాంక్షలు తెలుపుతూనే, మరోవైపు తన ప్రేమ మొత్తాన్ని ఉత్తరంలో ఒలకబోశాడు జై.

"నా జీవితంలో ప్రతి రోజును నువ్వు ప్రత్యేకంగా మార్చేస్తున్నావ్. దేవుడే కాదు, నేను కూడా నీకు తోడుగా ఉంటాను. హ్యాపీ బర్త్ డే అంజు". ఇలా రాసినవి 4 వాక్యాలే అయినా అందులో తన ప్రేమ మొత్తాన్ని కురిపించేశాడు జై.

Show comments