టాలీవుడ్ కు ఇది తొలి అడుగేమో?

నిజమే..బన్నీ ఆ విధంగా ఫస్ట్ నే. తమిళ్ స్టార్ లు వచ్చి మన దగ్గర భారీ ఫంక్షన్లు చేసి, మరింత భారీగా లాంచ్ అవుతుంటారు. కన్నడ స్టార్ లు కూడా వస్తున్నారు. కానీ మన స్టార్ లు మాత్రం పక్క భాషల్లో లాంచ్ కావడం లేదు. మన సినిమాలు అక్కడా డబ్ చేయడం వేరు. ఆడడం వేరు. మన హీరోలు అక్కడ ప్రచారం నిర్వహించడం వేరు. 

కానీ మన హీరోలు పనిగట్టకుని అక్కడకు వెళ్లి లాంచ్ కావడం అన్నది మాత్రం బన్నీతోనే మొదలయింది అనుకోవాలి. హీరోగా లాంచ్ కావడానికి ఎలా ఫంక్షన్ చేస్తారో అలా చేసారు ఇప్పుడు చెన్నయ్ లో బన్నీ కోసం జ్ఞాన్ వేల్ రాజా. హీరో సూర్య ఫ్యామిలీకి చెందిన జ్ఞాన్ వేల్ రాజాకు అల్లు అరవింద్ తో ఎప్పటి నుంచో బిజినెస్ అనుబంధాలు వున్నాయి. ఇప్పుడు బన్నీ లాంచింగ్ జ్ఞాన్ వేల్ కు కూడా స్ట్రాటజిక్ గా పనికి వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి వున్న సూర్య, కార్తీ సినిమాలకు ఇక్కడ అరవింద్ సహకారం వుంటుంది. అక్కడ బన్నీకి శివకుమార్, జ్ఞాన్ వేల్ రాజా సహకారం వుంటుంది. 

అరవింద్ మంచి స్ట్రాటజిస్టిక్ అండ్ కాలుక్యులేటెడ్ బిజినెస్ మెన్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లే. బన్నీ-లింగు స్వామి సినిమా అనౌన్స్ మెంట్ లా చేయలేదు ఫంక్షన్ అక్కడ. బన్నీని తమిళ సినిమా జనాలకు పరిచయం చేసే కార్యక్రమంలా నిర్వహించారు. అంటే ఇకపై బన్నీ సినిమాలు అన్నీ మల్టీ లింగ్యువల్స్ అన్నమాట. 

మహేష్ బాబు తమిళ్ డైరక్టర్ మురగదాస్ తో సినిమా చేస్తూ తమిళ, హిందీ మార్కెట్ లపై కన్నేస్తే, బన్నీ ఏకంగా అక్కడ ఎంటర్ అయిపోవాలని చూస్తున్నాడు. ఏదైనా టాలీవుడ్ కు మంచి పరిణామాలే.

Show comments