సూపర్‌ సీఎం లోకేష్‌..!

రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌ను తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం నేతలు, ప్రజా ప్రతినిధులు పొగత్తలతో ముంచేశారు. రాష్ట్ర మంత్రిగా లోకేష్‌ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రాగా, ప్రభుత్వ యంత్రాంగం, మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు నానా హంగామా చేశారు. తండ్రి చంద్రబాబు ఏర్పాట్లను తలదన్నే రీతిలో లోకేష్‌ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన సందర్భంలో కూడా ఇంత భారీగా పర్యటన ఏర్పాట్లు జరగలేదని సాక్షాత్తూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానించారు. లోకేష్‌ పర్యటించే ప్రాంతాల్లో భారీపత్తున పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ లోకేష్‌ను యువరాజు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

'రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్‌బాబు' అని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మరోఅడుగు ముందుకేవేసి ఆకాశానికి ఎత్తేశారు. 'మీకందరికీ తెలుసు మన చంద్రబాబునాయుడి గారబ్బాయి, తాత, తండ్రిబాటలో నడుస్తూ రాష్ట్ర ప్రజలకు సేవ సేస్తారు' అని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఈ పొగడ్తలకు చినబాబు కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇటీవలి కాలంలో లోకేష్‌ భవిష్యత్‌ ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ చినరాజప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన సందర్భాల్లో ఏ ప్రాంతానికి చెందిన పమ్మెల్యేలు ఆ ప్రాంతంలో సభలకు హాజరవుతుండగా, లోకేష్‌ పాల్గొన్న ఈ సభలకు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు పోటీపడి మరీ హాజరయ్యారు. 

భారీగా లోకేష్‌కు స్వాగతం పలుకుతూ ఆయనే భవిష్యత్‌ ముఖ్యమంత్రి అన్న రీతిలో స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేశారు. ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ జిల్లాలోని జి మేడపాడు గ్రామంలో జరిగిన సభలో రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్‌ అని చినరాజప్ప ప్రజలకు పరిచయం చేశారు. ముఖ్యమంత్రి పదవికి లోకేష్‌ అర్హుడా? కాదా? అన్న అంశాన్ని పక్కనపెడితే ఆయనకు ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు పోటీ పడ్డారు. జిల్లాకు చెందిన దాదాపు ప్రజాప్రతినిధులందరూ లోకేష్‌ను కలసి పరోక్షంగా ఆశీర్వాదం తీసుకున్నారు. స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లను తెలుగు యువతలో పోటీపడి మరీ ఆయా ప్రాంతాల సీనియర్‌ నేతలు ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ యువరాజు లోకేష్‌  అంటూ బ్యానర్లు కట్టారు. మా భవిష్యత్‌ నాయకుడు లోకేష్‌ అని కాకినాడ రూరల్‌ పమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. 

లోకేష్‌ మంత్రిగా రావడం మా అదృష్టం అని కాకినాడ పంపీ తోట నరసింహం పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడు లోకేష్‌ అంటూ కాకినాడ సిటీ పమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు బ్యానర్లు కట్టారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన రాజోలు పమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, రామచంద్రపురం పమ్మెల్యే తోట త్రిమూర్తులు, జగ్గంపేట పమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వంటి వారు సైతం లోకేష్‌ దృష్టిలో పడేందుకు ఆరాటపడ్డారు. ఇంకా పలువురు తెలుగుదేశం నేతలు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో నడిచి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లోకేష్‌ను కోరారు. అయితే ఎప్పటిలాగే ప్రసంగంలో లోకేష్‌ నోరుజారడం అందరికీ మంచి కామెడీని పంపింది. Readmore!

 కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరపలో నిర్వహించిన సభలో పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి నారాలోకేష్‌ నోరుజారారు. ఆయన చెప్పవలసిన విషయం రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానన్నది కాగా, 'రానున్న రెండేళ్ళలో అన్ని గ్రామాల్లోను తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యంగా పెట్టుకున్నాను' అని వ్యాఖ్యానించారు. ఇదివిని ఆశ్చర్యపోవడం అక్కడి నేతల వంతయ్యింది. అలాగే ప్రజలు లోకేష్‌ మాటలకు అవాక్కయ్యారు. అలాగే పల్లెను తల్లితోను, పట్టనాన్ని ప్రియురాలితో పోల్చిచెబుతూ ఆకట్టుకునేందుకు లోకేష్‌ ప్రయత్నించారు. రానున్న రెండేళ్ళలో ప్రతీ పల్లెలో రహదారులు నిర్మించి, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెబుతూ 'పల్లె తల్లి రమ్మంటుంది. పట్నం ప్రియురాలి వంటిది తెమ్మంటుంది' అని లోకేష్‌ వ్యాఖ్యానించి, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Show comments

Related Stories :