నాగబాబు మాటలపై స్పందించిన యండమూరి!

‘వాడు ఒక కుసంస్కారి.. మూర్ఖుడు.. ముందు వాడు వ్యక్తిత్వ వికాసాన్ని అభ్యసించాలి.. ఆ తర్వాత పక్క వాళ్లకు నేర్పాలి.. మెగా ఫ్యామిలీని ఏమైనా అంటే ప్రచారం వస్తుందని ఇలాంటి పాట్లు పడుతున్నారు. వాడు ప్రతిభ ఉన్న రచయితే.. ఆ విషయంలో నేను కాళ్లకు దండం పెడతా.. అయితే చరణ్ ను తక్కువ చేసి మాట్లాడాడు…’’ ఇవీ రచయిత యండమూరిని ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యానాలు.

తీవ్రంగానే ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల సున్నితంగా స్పందించాడు యండమూరి వీరేంద్రనాథ్. నాగబాబు ఎందుకలా మాట్లాడాడో తనకు తెలియదని యండమూరి వ్యాఖ్యానించడం గమనార్హం. బహుశా ఆయన ఆవేశంలో మాట్లాడి ఉండవచ్చని యండమూరి అంటున్నారు. ఇటీవలే నాగబాబును ఒక ఫంక్షన్ లో కలిశాను అని, ఆ సమయంలో గురువుగారూ.. ఒక సినిమా కథ కావాలి అని అడిగాడని, తామిద్దరం కలిసి ఒక సినిమాను కూడా చేయవచ్చని యండమూరి వ్యాఖ్యానించడం కొసమెరపు!

మొత్తానికి.. అసలు విషయం పోయి, కొసరు విషయం హైలెట్ అయినట్టుగా, ఖైదీ-150 ఫంక్షన్ లో నాగబాబు రెచ్చిపోయి మాట్లాడటం పై అంతా స్పందించేశారు. వర్మ క్షమాపణ చెప్పేయగా, యండమూరి నాగబాబు తో సాన్నిహిత్యం ఉందని ప్రకటించేశారు. సో.. కథ సుఖాంతం!

Show comments