దేవీ లవ్ అలాంటిది మరి

ఏం బాండింగ్ కుదిరిందో కానీ, డైరక్టర్ సుకుమార్ కు, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కు మధ్య. సుక్కూ సినిమాలంటే దేవీ ప్రాణం పెట్టి మరీ పాటలు చేసేస్తాడు. అయితే క్రెడిట్ తనది మాత్రమే కదు, తనకు ఏం కావాల్ లిరిక్స్, సిట్యువేషన్, ఇలా మొత్తం అరటిపండు వలిచినట్లు చెపుతాడు సుక్కూ. అందుకే అంత మంచి ట్యూన్ లు వస్తాయి అంటాడు దేవీ.

ఇప్పుడు లేటెస్ట్ సంగతి ఏమిటంటే, సుక్కూ-రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ నాలుగు అద్భుతమైన ట్యూన్ లు ఇచ్చేసాడట. అవి విన్నాక అర్థమయిందట సుక్కూ సినిమా అంటే దేవీ ఎంత ప్రాణం పెట్టి ట్యూన్ లు చేస్తాడో. ఓ పాటకు లిరిక్స్ కూడా రెడీ చేసేసాడట.

పాటలు విని సుకుమార్ ఓ హగ్ తో దేవీకి తన థాంక్స్ చెప్పేసాడట. అంతే మరి . వాళ్లిద్దరి మధ్య అభిమానాలు అలాంటివి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా దసరా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. అలా అని చెప్పకపోయినా ఆగస్టు నాటికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా ఫినిష్ చేసే దిశగా చకచకా పరుగెడుతున్నారు.

Show comments