శాతకర్ణికి లీక్ సమస్య?

సాధారణంగా తమ అభిమాన హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా వుంటుంది. పైగా సోషల్ మీడియా,  డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తరువాత ఫ్యాన్ చేసే సందడి ఇంకా పెరిగింది. తమ తమ ప్రావీణ్యంతో ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడం, సోషల్ నెట్ వర్క్ లో అప్ లోడ్ చేయడం వంటివి షురూ చేస్తారు. ఏది ఒరిజినల్, ఏది క్రియేషన్ అన్నది తెలియక జనం కిందా మీదా అవుతారు. 

అయితే నందమూరి బాలకృష్ణ సినిమాకు ఇంకో సమస్య షురూ అయిందట. దర్శకుడు క్రిష్ ఎంతగా తాళాలు వేసినా, గౌతమీ పుత్ర శాతకర్ణి స్టిల్స్ బయటకు లీక్ అయిపోతున్నాయట.  ఎక్కడి నుంచి వెళ్తున్నాయో పసిగట్టలేకపోతున్నారట. అలా లీక్ అయిన ఫొటోలు వగైరా ఫ్యాన్స్ ఫేస్ బుక్ పేజీల్లో ప్రత్యక్షం అవుతున్నాయట. దీంతో లీక్ అయిన వాటిని గుర్తించి, మళ్లీ వాటినే అఫిషియల్ గా పంపడం వంటి పనులు చేయాల్సి వస్తోందట.

 దీంతో సినిమా విషయాలు చాలా ఎక్కువగా బయటకు వచ్చేస్తున్నాయని దర్శకుడు క్రిష్ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. ఎవరు లీక్ చేస్తున్నారో, ఎక్కడ లీక్ చేస్తున్నారో అని కిందా మీదా అవుతున్నారట. సరే, స్టిల్స్ లాంటి కంటెంట్ సరే, తీరా సినిమా దగ్గరకు వచ్చేసరికి, విడియో బిట్లు, ఇంకేమన్నా లీక్ అయితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారట.

Show comments