శాతకర్ణిలో మోక్షజ్ఞ? నిజమేనా?

మనం సినిమా క్లయిమాక్స్ లో తళుక్కున మెరిసాడు అఖిల్. సూపర్ బజ్ వచ్చింది ఆ ఒక్క సినిమాతోనే అఖిల్ కెరీర్ కు. ఇప్పుడు అదే విధంగా నందమూరి మోక్షజ్ఞను కూడా పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు వాశిష్టపుత్ర పులోమావి గా మోక్షజ్ఞను జస్ట్ ఎట్ ఏ గ్లాన్స్ పరిచయం చేసే ఆలోచనలో హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్ వున్నారని తెలుస్తోంది. 

ఇది ఎలా వుండాలి..ఎన్ని నిమషాలు వుండాలి అన్నది డిస్కషన్ లో వున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఇలా పరిచయం చేయడం వల్ల మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా వుండబోతోంది అన్నదానిపై అభిమానులకు ఓ అయిడియా వస్తుందని బాలయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ తెరంగ్రేటం కోసం బాలయ్య చాలా జాగ్రత్తగా, మంచి బ్యానర్లు,  మంచి డైరక్టరను ఎంచి వుంచుతున్న సంగతి తెలిసిందే.

Show comments