అక్టోబర్ 6న ధృవ?

రామ్ చరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ముస్తాబవుతోంది ధృవ. ఈ సినిమాను అక్టోబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా పనులు షెడ్యూలు చేసుకుని ముందుకు సాగుతున్నారట.తమిళ సూపర్ హిట్ థని ఒరువన్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికి 60శాతం టాకీ పూర్తయిపోయిందట. 40శాతం టాకీ, రెండు పాటలు మాత్రమే బకాయి వున్నాయట. వీటిని చకచకా పూర్తి చేసి, అక్టోబర్ 6న దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలన్నది నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపుగా చాలా సినిమాలు ఆగస్టు, సెప్టెంబర్ ల్లో విడుదలయిపోతున్నాయి. దసరాకు షెడ్యూలు అయిన పెద్ద సినిమా దాదాపు లేనట్లే.  ధృవ తప్ప.

Show comments