ఎప్పటినుంచో సినిమాల్లో వున్నా, సరైన బ్రేక్ మాత్రం ఈ మధ్యనే దొరికింది 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి. సినిమా సినిమాకీ కమెడియన్‌గా రేంజ్ పెంచేసుకుంటున్నాడీ కమెడియన్. స్టార్ కమెడియన్‌గా ఇప్పటికే ఎదిగిన పృధ్వీ, ఒకప్పుడు బ్రహ్మానందం కోసం దర్శకులు సీన్లు రాసినట్లుగా, ఇప్పుడు తనకోసం సీన్లు రాసుకునేలా కెరీర్లో సూపర్బ్ ఇమేజ్‌ని సంపాదించేసుకున్నాడు.
తాజాగా పృధ్వీ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 'అందాల రాక్షసి' ఫేం నవీన్ చంద్ర ఈ సినిమాలో హీరో. 'పటాస్' పేం శృతి సోధి ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మరో జంటగా పృధ్వీ, సలోనీ నటిస్తున్నరు. హీరోతో సమానమైన పాత్రలో పృధ్వీ కనిపిస్తాడట. అలా ఇలా కాదు, సినిమా మొత్తమ్మీద తెరపై నవీన్ చంద్ర ఎంతసేపు కన్పిస్తాడో, అంతసేపూ పృధ్వీ కన్పించనున్నట్లు తెలుస్తోంది.
అసలు సిసలు జాక్ పాట్ అంటే ఇదే మరి. సినిమా సినిమాకీ పృధ్వీ కోసం వెరైటీ పాత్రల్ని దర్శకులు ప్రత్యేకంగా సృష్టించాల్సి వస్తోంది. కెరీర్లో ఈ పేస్‌ని తానెప్పుడూ ఊహించలేదనీ, ఇప్పుడొచ్చిన ఈ ఇమేజ్‌ని సంపాదించుకోవడం చాలా కష్టమైన పనీ అనీ, ఆ కష్టాన్ని ఇంకా కష్టంతోనే అధిగమిస్తానని అంటున్నాడు పృధ్వీ. సోలో హీరోగా కూడా అవకాశాలు వస్తున్నా ఆచి తూచి, అడుగులేస్తున్నాడట ఈ థర్టీ ఇయర్స్ ఇండస్రటీ హీరో.