రెండు రోజుల్లో పదికోట్లు లాగేసింది

జనాలకు నచ్చాలే కానీ నెత్తిన పెట్టేసుకుంటారు సినిమాను. ఫిదా సినిమా విడుదలకు వారం ముందువరకు పెద్దగా టాక్ లేదు. ఇండస్ట్రీలో పెద్దగా హోప్ లేదు. ఇది వాస్తవం. ఓవర్ సీస్ బయ్యర్ కూడా ఎందుకయినా మంచిదని ఏరియాల వారీ అమ్మేసి ముందే జాగ్రత్తపడ్డారు.

అలాంటి టైమ్ లో విడుదలకు జస్ట్ కొద్దిగా ముందుగా రెండో ట్రయిలర్ వచ్చింది. జనం ఫిదా అయిపోయారు. ట్రయిలర్ తోనే మొత్తం సినిమాను ఓన్ చేసుకున్నారు. ఆ ఎపెక్ట్ ఓపెనింగ్స్ మీద క్లియర్ గా కనిపించింది. తొలి రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు పదికోట్ల షేర్ లాగేసింది. మూడోరోజు సండే గురించి ఫిగర్లు బయటకు రావడానికి ఇంకా ఓ రోజు టైమ్ వుంది. కానీ ఏ రేంజ్ లో వుంటుదో సండే అంటే అన్నది అందరికీ తెలిసిందే. కనీసం మరో రెండు నుంచి మూడుకోట్లు జోడించేసుకోవచ్చు.

అంటే ఫస్ట్ వీకెండ్ లో ఫిదా కలెక్షన్లు 12 నుంచి 13 కోట్లు. అంటే మాగ్జిమమ్ పిండేసినట్లే. సినిమా ఖర్చే 15లోపు. 3.5 కోట్లకు శాటిలైట్ అయిపోయింది. నైజాం, వైజాగ్ లాంటి ఏరియాలు దిల్ రాజ్ ఓన్ గా విడుదల చేసుకుంటారు. ఇంకేముంది. సాయిపల్లవి, దిల్ రాజు పంట పండించింది.

Show comments